ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజీనామా చేసిన ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికార వైసిపి అభ్యర్థిగా మాజీ మంత్రి ఉత్తరాంధ్ర సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ఆ పార్టీ బరిలోకి దించుతోంది. సాధారణంగా అయితే వైసిపి ఈ స్థానాన్ని సులభంగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.
పీలా గోవింద సత్యనారాయణ, గండి బాబ్జి
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజీనామా చేసిన ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికార వైసిపి అభ్యర్థిగా మాజీ మంత్రి ఉత్తరాంధ్ర సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ఆ పార్టీ బరిలోకి దించుతోంది. సాధారణంగా అయితే వైసిపి ఈ స్థానాన్ని సులభంగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 800పైగా ఓట్లు ఉన్నాయి. వీరిలో ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, కార్పొరేటర్లు ఓటర్లుగా ఉన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతా 90 శాతం మంది వైసీపీకి చెందిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్షం సత్యనారాయణ విజయం నల్లేరుపై నడకగానే అంతా భావిస్తున్నారు. కానీ అధికార టిడిపి మాత్రం పోటీకి అభ్యర్థిని బరిలోకి దించేందుకు సిద్ధమవుతోంది. సామ, దాన, బేద, దండోపాయాలను ఉపయోగించి వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులను పార్టీలో చేర్చుకోవాలని టిడిపి భావిస్తోంది. శాసన మండలిలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఆశించిన స్థాయిలో ఎమ్మెల్సీలు లేరు. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా కొంతైనా బలం పెంచుకోవాలని టిడిపి భావిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సోమవారం పార్టీ ఆఫీసులో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడం పై లక్ష్యాలను విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ఈ స్థానం కోసం పోటీపడుతున్న వారి సంఖ్య కూడా టిడిపిలో ఎక్కువగానే ఉంది. మొన్నటి వరకు దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తూ పొత్తులో భాగంగా జనసేనకు ఆ సీటును కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి, అనకాపల్లి జిల్లాలో కూడా సీటును త్యాగం చేయాల్సి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పి వి జి కుమార్, బిజెపి నుంచి ఈర్ల శ్రీరామ్ మూర్తి తదితరులు ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కోరుకుంటున్నారు. అయితే అధికార పార్టీ ఎత్తులకు పైఎత్తులను వేస్తూ వైసిపి కూడా ఈ స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్న బొత్స సత్యనారాయణను బరిలోకి దించడం ద్వారా అధికార పార్టీ టిడిపిని జగన్ మోహన్ రెడ్డి డిఫెన్స్ లోకి నెట్టినట్టు అయింది. ఈ మూడు జిల్లాల్లో బొత్స సత్యనారాయణ అనుచరగణం ఎక్కువగానే ఉంది. ఆయన అయితేనే అంతా కలిసికట్టుగా పనిచేస్తారని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి బొత్సను ఎంపిక చేశారు. బొత్స సత్యనారాయణ సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని వైసిపి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుండగా, టిడిపి మాత్రం ఈ స్థానాన్ని దక్కించుకునే దిశగా వ్యూహాలను పన్నుతోంది. చూడాలి ఎవరి ఎత్తులకు ఎవరు చిత్తవుతారో.