దేశంలో క్రమంగా వందే భారత్ రైళ్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా మరో ఏడు వందే భారత రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిని శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఒక రైలును నేరుగా పాల్గొని జెండా ఊపి ప్రధాని ప్రారంభించగా, మిగిలిన ఆరు రైళ్లను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
కొత్తగా ప్రారంభమైన వందే భారత రైలు
దేశంలో క్రమంగా వందే భారత్ రైళ్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా మరో ఏడు వందే భారత రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిని శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఒక రైలును నేరుగా పాల్గొని జెండా ఊపి ప్రధాని ప్రారంభించగా, మిగిలిన ఆరు రైళ్లను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా వందే భారత రైళ్ల సంఖ్యను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. ఈ క్రమంలోనే మరిన్ని వందే భారత రైళ్లను తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా అందుబాటులోకి వచ్చిన వందే భారత రైళ్లలో జార్ఖండ్లోని జంషెడ్పూర్ టాటా నగర్ రైల్వే స్టేషన్ నుంచి టాటా - పాట్నా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా జెండా ఊపి ప్రారంభించారు. మిగిలిన ఆరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
మోడీ ప్రారంభించిన ఈ రైళ్లలో టాటా నగర్ - పట్న, బ్రహ్మపూర్ - టాటా నగర్, రూర్కెలా - హౌరా, డియోఘర్ - వారణాసి, బాగల్పూర్ - హౌరా, గయా - హౌరా వంటి ఆరు కొత్త మార్గాల్లో ఈ వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ టాటానగర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారం నెంబర్ ఒకటి నుంచి టాటా నగర్ - పాట్నా వందే భారత్ రైలును ప్రత్యక్షంగా జండా ఊపి ప్రారంభించారు. రైల్వే ఉన్నతాధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ జార్ఖండ్ మీదుగా చాలా వందే భారత రైళ్లు వెళ్తాయని పేర్కొన్నారు. ఒకేసారి ఏడు వందే భారత రైళ్ళను ప్రారంభించడం రైల్వేకి గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ వందే భారత రైళ్ల సంఖ్యను పెంచుతుండడం పట్ల ప్రయాణికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివిధ మార్గాల్లో ఈ నూతన రైళ్లు అందుబాటులోకి తీసుకురావడం వలన వేలాది మంది ప్రయాణికులకు మేలు కలుగుతుందని చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జోరుగా చర్యలు చేపడుతుంది. ఇప్పటికే ఈ రైలు తయారవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.