వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే భయ్యా

వివో కంపెనీ మరో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది Y సిరీస్‌లోకి కొత్తగా వచ్చిన ఫోన్‌గా చెబుతున్నారు. ఇటీవల విడుదలైన VIVO Y39 5G అప్డేటెడ్‌ మోడల్‌ ఫోన్‌ ఇది. భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్‌ మన్నిక, 5G కనెక్టివిటీ వంటి లక్షణాలతో ఇది బడ్జెట్‌ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకట్టుకునేలా ఫోన్‌గా నిలుస్తుంది. మరిన్ని ఫీచర్స్‌ ఉన్న ఈ మొబైల్‌కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. వివో Y19 5G మొబైల్‌లో 6.74 అంగుళాల HD + LCD డిస్‌ ప్లే లభిస్తుంది. దీనికి 90 Hz రిఫ్రెష్‌ రేట్‌, 840 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ లభిస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డిమెంసిటీ 6300 చిప్‌సెట్‌ కలిగి ఉంటుంది. ఇందులో గేమింగ్‌ కోసం Mail G57 MC2 GPUను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ 4GB, 6GB RAM లభించనుండగా, అదనంగా 6GB వరకు వర్చువల్‌ ర్యామ్‌ సపోర్ట్‌ ఉంది.

VIVO Y39 5G

వివో Y39 5G  ఫోన్‌

వివో కంపెనీ మరో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది Y సిరీస్‌లోకి కొత్తగా వచ్చిన ఫోన్‌గా చెబుతున్నారు. ఇటీవల విడుదలైన VIVO Y39 5G అప్డేటెడ్‌ మోడల్‌ ఫోన్‌ ఇది. భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్‌ మన్నిక, 5G కనెక్టివిటీ వంటి లక్షణాలతో ఇది బడ్జెట్‌ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకట్టుకునేలా ఫోన్‌గా నిలుస్తుంది. మరిన్ని ఫీచర్స్‌ ఉన్న ఈ మొబైల్‌కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. వివో Y19 5G మొబైల్‌లో 6.74 అంగుళాల HD + LCD డిస్‌ ప్లే లభిస్తుంది. దీనికి 90 Hz రిఫ్రెష్‌ రేట్‌, 840 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ లభిస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డిమెంసిటీ 6300 చిప్‌సెట్‌ కలిగి ఉంటుంది. ఇందులో గేమింగ్‌ కోసం Mail G57 MC2 GPUను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ 4GB, 6GB RAM లభించనుండగా, అదనంగా 6GB వరకు వర్చువల్‌ ర్యామ్‌ సపోర్ట్‌ ఉంది. స్టోరేజ్‌ పరంగా 64 GB, 128 GB వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మైక్రో SD ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు. కెమెరా కూడా అద్భుతంగా ఉంటుంది. వివో Y19 5Gలో 13 MP ప్రైమరీ కెమెరాతోపాటు 0.08 MP పోర్ర్టెయిట్‌ కెమెరా ఉంది. ముందు భాగంలో 5 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్‌ 15పై పని చేస్తూ, Funtouch OS 15 వినియోగదారులకు అందిస్తుంది. ఇందులో ఐ Erase, AI Photo Enhance, AI డాక్యుమెంట్స్‌ వంటి అత్యాధునిక AI ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్‌ 5,500 mAh భారీ బ్యాటరీతో వస్తోంది. ఇది 15 W ఫాస్ట్‌ చార్జింగ్‌తోపాటు రివర్స్‌ వైర్డ్‌ చార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది. దీనికి బ్లూవోల్ట్‌ టెక్నాలజీ మద్ధతుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్యాటరీకి ఐదేళ్లపాటు లాంగ్‌ బ్యాటరీ హెల్త్‌ గ్యారంటీ కఊడా అందిస్తున్నారు. వివో Y19 5G మిలిటరీ గ్రేడ్‌ మన్నికతో లభిస్తుంది. అలాగే, IP64 రేటింగ్‌ ద్వారా దుమ్ము, నీటి నుంచి రక్షణ ఉంటుంది. ఈ ఫోన్‌ యూఎస్‌బీ టైప్‌ సి పోర్ట్‌, 200 శాతం వాల్యూమ్‌ బూస్టర్‌ ఉన్న స్పీకర్‌, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ లాంటి ఫీచర్లతో వస్తుంది. వివో Y19 5G టిటానియం సిల్వర్‌, మజెస్టిక్‌ గ్రీన్‌ రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ధరలు, లభ్యత విషయానికి వస్తే 4GB + 64 GB వేరియంట్‌ రూ.10,499 కాగా, 4GB + 128 GB వేరియంట్‌ రూ.11,499, 6 GB + 128 GB వేరియంట్‌ రూ.12,999కు లభిస్తోంది. ఈ ఫోన్‌ ఆన్‌లైన్‌లో ప్లిప్‌కార్ట్‌, వివో ఇండియా సైట్స్‌తోపాట రిటైల్‌ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్‌ కింద 6GB + 128 GB వేరియంట్లపై జీరో డౌన్‌పేమెంట్‌తోపాటు మూడు నెలలపాటు నో కాస్ట్‌ ఈఎంఐ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం సరికొత్త ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ మీ సొంతం చేసుకోండి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్