హానర్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. అదరగొడుతున్న ఫీచర్లు

హానర్ కంపెనీ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆధ్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఫోన్లో ఉన్న భిన్నమైన ఫీచర్లు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోన్లో 6.78 అంగుళాల 1.5 k AMOLED డిస్ ప్లే ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నేస్ ను అందిస్తుంది. అంతేకాకుండా 3840 Hz హాయ్ ఫ్రీక్వెన్స్ PWM డిమింగ్ సపోర్టుతో కళ్ళకు మెరుగైన విజువల్ అనుభవం ఇస్తుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

హానర్ కంపెనీ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆధ్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఫోన్లో ఉన్న భిన్నమైన ఫీచర్లు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోన్లో 6.78 అంగుళాల 1.5 k AMOLED డిస్ ప్లే ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నేస్ ను అందిస్తుంది. అంతేకాకుండా 3840 Hz హాయ్ ఫ్రీక్వెన్స్ PWM డిమింగ్ సపోర్టుతో కళ్ళకు మెరుగైన విజువల్ అనుభవం ఇస్తుంది. ఫోన్లో snapdragon 7 Gen 3 (4nm) ప్రాసెసర్, Adreno 720 GPU తోపాటు 8GB/12 GB RAM, 256 GB స్టోరేజీతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ OS పై రన్ అవుతుంది. 

ఈ ఫోన్ 10 సైడేడ్ యాంటీ ఫాల్ షాక్ అబ్జర్బింగ్ స్ట్రక్చర్ 2.0, 360  డిగ్రీలు వాటర్ ప్రూఫ్ బాడీ కలిగి ఉంది. దీనివల్ల సెల్ ఫోన్ నీటిలో తడిసిన ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. అలాగే ఈ ఫోన్కు ఉన్న ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరో అదనపు ఫీచర్ గా చెప్పవచ్చు. కెమెరా సెట్ అప్ విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో 50 MP ప్రైమరీ కెమెరా, 5 MP ఆల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఇది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. ముందు భాగంలో 16 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ప్రత్యేకతలో బ్యాటరీ ముందుగా ఉంటుంది. ఇందులో 8000 mAh మూడోతరం సిలికాన్ కార్బన్ బ్యాటరీ వినియోగించారు. ఇది 66 W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ ఆరు సంవత్సరాల లాంగ్ లైఫ్ కలిగి ఉండడమే కాకుండా ఇది మొబైల్ ఫోన్లలో తొలి 8000 mAh బ్యాటరీగా రికార్డ్ సృష్టించనుంది. ఈ ఫోన్లో 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, wifi 7, బ్లూటూత్ 5.3, GPS (L1+L5), USB టైపు c, NFC వంటి అనేక అధునాతన కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. స్టీరియో స్పీకర్లు, యుఎస్బి సి ఆడియో కూడా అందుబాటులో ఉన్నాయి. 12 GB+512 - 2499 యాన్స్ అంటే సుమారు రూ.29,140 గా నిర్ణయించారు. చైనాలో హానర్ పవర్ ను అధికారికంగా విడుదల చేసింది. హానర్ పవర్ ఫోన్ అత్యధిక ఫీచర్లతో, గొప్ప బ్యాటరీ లైఫ్ తో, అత్యుత్తమ డిజైన్తో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. భవిష్యత్తులో భారత మార్కెట్లోకి విడుదలకు సంబంధించి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్