టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది వివిధ రకాల పనులు చేపట్టేందుకు పలు గాడ్జెట్స్ ను ప్రజలు వినియోగిస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగానే అనేక కంపెనీలు వివిధ రకాల గాడ్జెట్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. నిత్యం ప్రజల అవసరాలను మరింత తీర్చేలా ఈ తరహా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చిన కొన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కోసం ప్రత్యేక పరికరాలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఒకటి వాటర్ పెబుల్. ఖచ్చితమైన కొలతతో స్నానం చేస్తే చాలా నీటిని ఆదా చేసేందుకు అవకాశం ఉంటుంది.
వాటర్ పెబుల్
టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది వివిధ రకాల పనులు చేపట్టేందుకు పలు గాడ్జెట్స్ ను ప్రజలు వినియోగిస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగానే అనేక కంపెనీలు వివిధ రకాల గాడ్జెట్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. నిత్యం ప్రజల అవసరాలను మరింత తీర్చేలా ఈ తరహా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చిన కొన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కోసం ప్రత్యేక పరికరాలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఒకటి వాటర్ పెబుల్. ఖచ్చితమైన కొలతతో స్నానం చేస్తే చాలా నీటిని ఆదా చేసేందుకు అవకాశం ఉంటుంది. అంత ఖచ్చితంగా కొలత ప్రకారం స్నానం చేయడం సులువుగా సాధ్యం కాదు. కొలత ప్రకారం ప్రతిరోజు స్నానం చేసేందుకు అనుగుణంగా నీటిని వినియోగించేలా ఈ వాటర్ పెబుల్ ను డిజైన్ చేశారు. చూడడానికి చిన్న గుండ్రటి బిళ్ళలా కనిపిస్తుంది. కానీ ఇది కేవలం నాలుగు నిమిషాల్లో మాత్రమే స్నానం చేసేలా మిమ్మల్ని ట్రైన్ చేస్తుంది. సమయం మించిపోయే కొద్ది ట్రాఫిక్ సిగ్నల్స్ మాదిరిగా ఎరుపు, నారింజ, ఆకుపచ్చ లైట్లతో హెచ్చరికలు చేస్తుంది. ఎరుపుల్ రాంగో లైట్ చూపిస్తే స్నానం వెంటనే పూర్తి చేయమని అర్థం. నారింజ రంగు అయితే సగం స్నానం పూర్తి చేశారని అర్థం. ఆకుపచ్చ అయితే సమయం ఇంకా ఉందని అర్థం. ఇలా ఎంతో సులభంగా అందరూ అర్థం చేసుకునేలా ఉండే దీని ధర 14 (రూ.1,119) డాలర్లుగా ఉంది.
అలాగే కొళాయి వద్ద నీటిని తీసుకునే దానిని కొలిచేందుకు అనుగుణంగా ఒక డివైస్ డిజైన్ చేశారు. మంచినీటి కొళాయి మనకు ఎంత అవసరమో అంతే నీటిని కొలిచి ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. దీని పేరే మెజర్ ఫిల్ టచ్ కిచెన్ టాప్. చాలా రకాల వంటకాలు కచ్చితంగా నీటిని కొలతతోనే ఉండాలి. అటువంటి వంటలకు వంటగదికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 100 మిల్లీలీటర్ నుంచి ఐదు లీటర్ల వరకు ఖచ్చితమైన నీటి పరిమాణాన్ని ఇది అందిస్తుంది. అవసరమైన మేరకు కొలతను సర్దుబాటు చేసుకునే వీలుంది. ఇందులోనే టచ్ ఫంక్షన్ హాల్టి సాయంతో సులభంగా ఆన్, ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ టాప్ ఆఫ్ చేయటం మర్చిపోతే ఐదు నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా టాప్ ఆఫ్ అయిపోతుంది. దీని ధర 359 డాలర్లుగా ఉంది. భారతీయ కరెన్సీ రూ.30,741 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే తడి పొడి వాటర్ ను కలిపేందుకు అనుగుణంగా మరో గాడ్జెట్ కూడా అందుబాటులోకి వచ్చింది. వేసవికాలం వచ్చిందంటే చాలామంది వాటర్ రైడ్, స్విమ్మింగ్ ఎలా వివిధ రకాల జలక్ క్రీడలతో కాలక్షేపం చేయడానికి వెళుతుంటారు. అయితే చెమట, తడి దుస్తులు కారణంగా లగేజీ మొత్తం దుర్వాసన వస్తుంది. ఇలా కాకుండా ఈ వెట్ అండ్ డ్రై సపరేషన్ బ్యాగ్ తో తడి దుస్తులను, పొడి దుస్తులను వేరువేరుగా ఉంచితే దుర్వాసన కూడా రాకుండా అరికడుతుంది. ఇది అత్యుత్తమ వాటర్ ప్రూఫ్ లైనింగ్, వాటర్ ప్రూఫ్ జిప్పర్ తో వస్తుంది. జిమ్, లాండ్రీ బ్యాగ్ లో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. స్మాల్, మీడియం, లార్జ్ ఇలా వివిధ సైజుల్లో లభిస్తుంది. ధర వివిధ తయారీ కంపెనీలు, పరిమాణాలను బట్టి ఉంటుంది. ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ గాడ్జెట్స్ ను మీరు వినియోగించండి మరి.