లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో టీటీడీ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలోనే ఉన్నారు. ఆయన తిరుపతిలో ఉండగానే టీటీడీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే తిరుమల పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
తిరుపతిలో వంటశాలను ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో టీటీడీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. టిటిడి లడ్డు కల్తీ వ్యవహారానికి కారణంగా భావిస్తున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని తాజాగా టీటీడీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం అనేక శాఖలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేసింది. అందులో భాగంగానే టీటీడీలో కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం నెయ్యి సరఫరా చేసే సంస్థను కూడా మార్చింది. తక్కువ రేటుకు ఇచ్చిన మరో డైయిరీకి ఈ బాధ్యతలను అప్పగించింది గత వైసిపి ప్రభుత్వం. రివర్స్ టెండరింగ్ వల్లే సదరు నెయ్యి సరఫరా చేసే సంస్థ కల్తీకి పాల్పడినట్లు కూటమి నాయకులు విమర్శలను గుప్పించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నెయ్యి కల్తీ వ్యవహారాన్ని కొద్దిరోజుల కిందటే బయటపెట్టింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కూడా పూర్తిస్థాయిలో విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ అనంతరం సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే ఉద్దేశంతోనే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అంతకుముందు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలను చేసింది. మతాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ స్పష్టం చేసింది.
ఆధారాలు లేకుండా కల్తీ జరిగినట్లు ఎలా మాట్లాడుతారు అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో టీటీడీ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలోనే ఉన్నారు. ఆయన తిరుపతిలో ఉండగానే టీటీడీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే తిరుమల పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తిరుమలలోని పాంచ జన్యం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఆధునిక వంటశాలను ఆయన ప్రారంభించారు. ఈ వంటశాలను సుమారు రూ.13.45 కోట్ల వ్యయంతో 37,245 చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో ఆధునిక సౌకర్యాలతో వంట, ఆహార ధాన్యాలు, కూరగాయలు మరియు పాలు మొదలైన వాటిని సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. మొదట అంతస్తులో ఆహార తయారీ కోసం ఆవిరి ఆధారిత వంట, ఎల్పీజీ ద్వారా నడిచే బాయిలర్లు, ఎగ్జాస్ట్ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ వంటశాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అనంతరం పరిశీలించారు.