ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం.. హరీష్ రావు, రాధా కిషన్ రావుపై ఆరోపణలు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టైపింగ్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు పేర్లు మళ్లీ తాజాగా తెరపైకి వచ్చాయి. దీంతో ఈ కేసు కొత్త మలుపులు తీసుకున్నట్టు అయింది. ఫోన్ టాపింగ్ తో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు ఎప్పటికీ అరెస్టు చేశారు. చక్రధర్ గౌడ్ ఫోన్ టైపింగ్ చేసిన ఘటనలో వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాము అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్లు పంపిస్తూ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

Harish Rao, Radha Kishan Rao

 హరీష్ రావు, రాధా కిషన్ రావు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టైపింగ్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు పేర్లు మళ్లీ తాజాగా తెరపైకి వచ్చాయి. దీంతో ఈ కేసు కొత్త మలుపులు తీసుకున్నట్టు అయింది. ఫోన్ టాపింగ్ తో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు ఎప్పటికీ అరెస్టు చేశారు. చక్రధర్ గౌడ్ ఫోన్ టైపింగ్ చేసిన ఘటనలో వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాము అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్లు పంపిస్తూ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ఏ1, రాధాకృష్ణన్ రావు ఏ2 గా పోలీసులు పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు చేస్తూ డబ్బులు వసూలుకు పాల్పడ్డ ముగ్గురు నిందితులు కలిసి ఒక రైతు డాక్యుమెంట్స్ తో సిమ్ కార్డు కొనుగోలు చేశారు. ఆ తరువాత రైతుకు తెలియకుండానే ఆయన డాక్యుమెంట్స్ ను సిమ్ కార్డు కోసం ఉపయోగించారు. ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర గౌడ్ కు బెదిరింపు మెసేజ్లు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాల్లో చక్రధర్ గౌడ్ పాల్గొనకుండా బెదిరింపులు చేశారు. ఈ వ్యవహారంలో వంశీకృష్ణను కీలక నిందితుడిగా పోలీస్ అధికారులు గుర్తించారు. హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వంశీకృష్ణ ఆయన పేషీలో పనిచేశాడు. గతంలో ఆరోగ్యశ్రీ స్కీములో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి కూడా వంశీకృష్ణ అనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో వంశీకృష్ణ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన అలజడని రేకెత్తిస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు పేర్లు ప్రధాన నిందితులుగా చేర్చడం రాజకీయంగా ప్రకంపనులు సృష్టిస్తోంది. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారణ జరిపే అవకాశం ఉంది. ఆ తరువాత నిందితులపై చర్యలకు అధికారులు సిద్ధమవుతారని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్