ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని జపాన్ సంస్థ హాన్ హిడాంకియోకు లభించింది. దీనికి సంబంధించి నోబెల్ కమిటీ ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. అణు రహిత సమాజం కోసం ఆ సంస్థ సేవకు గుర్తింపుగా
జపాన్ సంస్థ హాన్ హిడాంకియోకు నోబెల్ శాంతి బహుమతి
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని జపాన్ సంస్థ హాన్ హిడాంకియోకు లభించింది. దీనికి సంబంధించి నోబెల్ కమిటీ ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. అణు రహిత సమాజం కోసం ఆ సంస్థ సేవకు గుర్తింపుగా ఈ ఏడాది శాంతి బహుమతిని అందజేస్తున్నట్లు నోబెల్ నిర్వాహకులు తెలిపారు. హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడి జరిగిన తర్వాత జపాన్ లో ప్రజలు అనుభవించిన కష్టాలను,నష్టాలను ప్రపంచానికి తెలీయజేసేందుకు ఈ సంస్థ 1956లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అణు యుద్దం వస్తే జరిగే పరిణామాల గురించి ప్రపంచ వ్యాప్తంగా విస్త్రుతంగా ప్రచారం చేస్తోంది. అణురహిత సమాజం కోసం ఈ సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. అణ్వాయుధ నిరాధికరణ కోసం ఈ సంస్థ ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్య కార్యక్రమానలు నిర్వహిస్తోంది. దీంతో హాన్ హిడాంకియో సంస్థ చేస్తున్న సేవలకు గుర్తింపుగానే ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కించుకుంది.