మానవత్వం మంటగలిచేలా భోపాల్ లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది వ్యవహరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్ పై చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి భార్యతో ఆ బెడ్ ను ఆసుపత్రి శుభ్రం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ గర్భిణీ కాగా.. తన భర్త చనిపోయిన బెడ్ ను శుభ్రం చేస్తూ ఉన్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
బెడ్ శుభ్రం చేస్తున్నరామ్ రాజ్ భార్య రోష్ణి మరావి
మానవత్వం మంటగలిచేలా భోపాల్ లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది వ్యవహరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్ పై చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి భార్యతో ఆ బెడ్ ను ఆసుపత్రి శుభ్రం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ గర్భిణీ కాగా.. తన భర్త చనిపోయిన బెడ్ ను శుభ్రం చేస్తూ ఉన్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన ఎంతోమంది తీవ్ర స్థాయిలో ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. మధ్యప్రదేశ్ లోని డిండోరీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన రామ్ రాజ్ మరవి (28)కి తమ సమీప బంధువులతో భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే లాల్పూర్ సాని గ్రామంలో గురువారం సాయంత్రం శివరాజ్, అతని తండ్రి ధరమ్ సింగ్ (65), సోదరుడు రఘు రాజ్ (42) పై దాదాపు 25 మంది వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో రామ్ రాజ్ ఇద్దరు అన్నలు, తండ్రి మరణించారు. రామ్ రాజ్ గాయాలతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్స పొందుతున్న క్రమంలో రామ్ రాజ్ కూడా శుక్రవారం మృతి చెందాడు.
చికిత్స చేసే క్రమంలో రామ్ రాజ్ శరీరం నుంచి రక్తం కారి బెడ్ పై పడింది. ఆసుపత్రి సిబ్బంది రామ్ రాజ్ మృతి చెందిన తరువాత ఆయన భార్యను పిలిచి బెడ్డును శుభ్రం చేయాలని ఆదేశించారు ఆసుపత్రి సిబ్బంది. ఐదు నెలల గర్భిణీ అయినా ఆమె భర్త మృతి చెందిన విషయం తెలుసుకుని రోదిస్తూ ఉండగా ఆసుపత్రి సిబ్బంది మాత్రం బెడ్ శుభ్రం చేయమని చెప్పడం గమనార్హం. భర్త పోయిన దుఃఖాన్ని అదిమి పెట్టుకుని ఆసుపత్రిలోకి వెళ్లి తన భర్త శ్వాస విడిచిన బెడ్ ను భార్య రోష్ణి మరావి శుభ్రం చేశారు. ఆమె బెడ్ శుభ్రం చేస్తున్న విధానాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తగు వైరల్ అవుతుంది. ఆమె బెడ్ ను శుభ్రం చేస్తుండగా అక్కడే ఉన్న సిబ్బంది ఆమెకు నీళ్లు ఇస్తూ ఆదేశాలను జారీ చేస్తుండడం కూడా వీడియోలు కనిపించింది. ఈ వీడియోను చూసిన నేటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎక్కడ ఉన్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటే.. ఇటువంటి వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళలను ఇలా వేధింపులకు గురి చేయడం దారుణం అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారంపై అక్కడి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.