రేషన్ కార్డు దరఖాస్తులపై ప్రభుత్వం కీలక ప్రకటన.. ఆందోళన వద్దంటూ సూచన.!

తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తోంది. భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఎగబడుతున్నారు. మీసేవ కేంద్రాలు ఖాళీ ఉండడం లేదు. వందలాది మంది దరఖాస్తు చేసేందుకు వస్తుండడంతో దరఖాస్తు ప్రక్రియ కూడా ఆలస్యం అవుతోంది. దరఖాస్తు చేసేందుకు భారీ సంఖ్యలో లబ్ధిదారులు వస్తుండడంతో ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. పద్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎవరు కంగారు పడవద్దని అధికారులు ప్రజలకు సేవ పలికారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ ఒక్కసారి తో పూర్తి కాదని అధికారులు చెబుతున్నారు.

 symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తోంది. భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఎగబడుతున్నారు. మీసేవ కేంద్రాలు ఖాళీ ఉండడం లేదు. వందలాది మంది దరఖాస్తు చేసేందుకు వస్తుండడంతో దరఖాస్తు ప్రక్రియ కూడా ఆలస్యం అవుతోంది. దరఖాస్తు చేసేందుకు భారీ సంఖ్యలో లబ్ధిదారులు వస్తుండడంతో ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. పద్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎవరు కంగారు పడవద్దని అధికారులు ప్రజలకు సేవ పలికారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ ఒక్కసారి తో పూర్తి కాదని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త దరఖాస్తులు తీసుకుంటామని వెల్లడిస్తున్నారు. కాబట్టి ఎవరు కంగారుపడి ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అనే ఆలోచన వద్దనే అధికారులు సూచిస్తున్నారు. వందలాది మంది దరఖాస్తు కోసం వెళుతుండడంతో మొత్తం ప్రక్రియ ఆలస్యం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఒకే అభ్యర్థి పదేపదే దరఖాస్తులు చేయడం వల్ల డూప్లికేషన్ ఎక్కువ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఆలస్యం కావడానికి కారణంగా అధికారులు పేర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లు మాత్రం మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా కారణంతో ఇప్పటివరకు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయని వారు మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకటించిన జాబితాలో పేర్లు లేని వాళ్ళు మాత్రమే మీ సేవా కేంద్రంలో అప్లై చేయాలని సూచిస్తున్నారు. మిగిలిన వాళ్ళు రావద్దని అధికారులు వెల్లడించారు. 

దరఖాస్తుకు బారులు..

రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పిన వెంటనే ఒక్కసారిగా ఆశావహులు భారీ సంఖ్యలో మీసేవ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. వందలాదిగా వస్తున్న దరఖాస్తుదారులతో మీ సేవ కేంద్రాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దరఖాస్తు ప్రక్రియ కూడా తీవ్ర ఆలస్యం అవుతుంది. ఒకేసారి వందలాది అప్లికేషన్స్ పెట్టాల్సి వస్తుండడంతో సర్వర్ కూడా సరిగా పనిచేయడం లేదు. దీంతో చాలామంది దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మరోసారి అవకాశం రాదు అన్న రీతిలో దరఖాస్తుదారుల్లో ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. దరఖాస్తు ప్రక్రియ నిరంతరం అందుబాటులో ఉంటుందని, ఎవరు ఆందోళన చెందవద్దు ప్రకటించింది. తాజా ప్రకటన నేపథ్యంలో దరఖాస్తు చేసేందుకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుందేమో చూడాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్