శృంగారాన్ని ప్రోత్సహించేలా శృంగార మంత్రిత్వ శాఖ.. ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ఆ దేశ ప్రభుత్వం

దేశంలో జనాభాను పెంచేందుకు శృంగారాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఏకంగా ఒక దేశ ప్రభుత్వం శృంగార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇదే ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శృంగార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయబోతున్న దేశం రష్యా కావడం గమనార్హం.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

శృంగారం.. ఈ మాట బహిరంగంగా మాట్లాడుకోవడానికి కూడా ఇప్పటికీ చాలామంది సంకోచిస్తుంటారు. శృంగారం అనేది ఇద్దరి అంతరంగిక వ్యవహారంగా చాలామంది భావిస్తారు. అయితే, ఒక దేశంలో జనాభాను పెంచేందుకు శృంగారాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఏకంగా ఒక దేశ ప్రభుత్వం శృంగార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇదే ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శృంగార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయబోతున్న దేశం రష్యా కావడం గమనార్హం. గడిచిన మూడేళ్లుగా ఉక్రేయిన్ తో ఈ దేశం యుద్ధాన్ని కొనసాగిస్తోంది. దీనివల్ల అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒక చిన్న దేశాన్ని అదుపులోకి తెచ్చుకునేందుకు రష్యా పడరాని పాట్లు పడుతోంది. మూడేళ్లకుపైగా యుద్ధం చేయాల్సి రావడంతో ఆ దేశ జనాభాపై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతున్నట్లు గుర్తించింది. వీటితోపాటు జనాభా తగ్గుదలకు అనేక అంశాలు కారణంగా భావించిన రష్యా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. జనాభా తగుదల సమస్యను ఎదుర్కొంటున్న రష్యా ఒక అడుగు ముందు కేసు ప్రత్యేకంగా శృంగార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సీరియస్ గా ఆలోచిస్తుంది. దేశంలో తగ్గిపోయిన జనాభా సంఖ్యను పెంచేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక ఆదేశాలను ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు సలహాదారులు ప్రత్యేకంగా శృంగార మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కొద్దిరోజుల్లోనే ఈ శాఖ ఏర్పాట అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ శాఖ ఏర్పాటైన తర్వాత పెళ్లైన జంటలు ఏకాంతంగా గడిపేలా ప్రోత్సాహాన్ని అందించనున్నారు. ఇందుకోసం ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి రెండు గంటల వరకు ఇంట్లో లైట్లు, ఇంటర్నెట్ బంద్ చేయాలని, ఇంట్లో ఉండే మహిళలకు జీతం ఇవ్వాలని, కొత్తజంటల ఫస్ట్ నైట్ కు హోటల్ ఖర్చుల కోసం ప్రత్యేకంగా డబ్బు ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక పని ప్రదేశాల్లో లంచ్, కాఫీ బ్రేకులు సంతాన ఉత్పత్తి బ్రేకులుగా వాడుకోవాలని మరో ఆసక్తికరమైన ప్రతిపాదనగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయం వల్ల దేశంలో జనాభా పెంచే అవకాశం ఉంటుందని పుతిన్ సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా రష్యాలో గడిచిన కొన్నాళ్ళుగా జననాల సంఖ్య తగ్గిపోయింది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తగ్గుతున్న జనాభా వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే రష్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. జనాభా సంఖ్యను పెంచేందుకు అనుకూలమైన ప్రోత్సాహాలను ప్రభుత్వం అందించేలా ఈ చర్యలకు ఉపక్రమిస్తుంది. ఈ క్రమంలోనే శృంగారమంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయబోతోంది రష్యా ప్రభుత్వం. అయితే ఈ శాఖ ఏర్పాటు వల్ల ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది అన్నది చూడాల్సి ఉంది. పూర్తిస్థాయిలో ఈ శాఖ ఏర్పాటు కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్