కొత్త ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం.. సామాన్యులకు తీపి కబురును అందించిన ప్రభుత్వం

నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దసరా పండుగ నేపథ్యంలో ఈ శుభవార్తను ప్రభుత్వం అందించింది.

double bedroom house ready for distribution

పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు

నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దసరా పండుగ నేపథ్యంలో ఈ శుభవార్తను ప్రభుత్వం అందించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నిరుపేదలైన అర్హులందరికీ ఇళ్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసే దిశగా ప్రస్తుతం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇల్లు పంపిణీ ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయి అందుబాటులో ఉన్న ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5500కుపైగా కొత్త డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేయనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయిస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది.

అందుకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ప్రస్తుతం నల్గొండ జిల్లాలో అందుబాటులో ఉన్న ఇళ్లను మాత్రం ప్రభుత్వం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్కో నియోజకవర్గంలో 3500 చొప్పున కేటాయిస్తే మొత్తంగా 38,500 ఇల్లు మంజూరు కానున్నాయి నాగార్జునసాగర్ కు ప్రత్యేకంగా ఐదువేల ఇళ్లను కేటాయిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకొని ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లబ్ధిదారులకు డ్రా విధానంలో ఎంపిక చేశారు. ఇప్పుడు కూడా వారికే ఈ ఇళ్లను కేటాయిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కొత్తగా నిర్మాణం చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కమిటీలు ద్వారా అర్హులను గుర్తిస్తారని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి వాటిని లబ్ధిదారులకు అందించనున్నారు. ఇప్పటికే పూర్తయి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను మాత్రం రెండు మూడు వారాల్లోనే లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీంతో ఆయా లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులను గతంలోనే లాటరీ విధానంలో ఎంపిక చేశారు. దాదాపు ఆ లాటరీలో ఎంపికైన లబ్ధిదారులకు మాత్రమే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత వేగంగా ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్