ఏపీలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది. ఇందుకోసం సరికొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకురాబోతోంది. వాట్సాప్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మొదట ఈ కార్యక్రమాన్ని తెనాలిలో ప్రయోగాత్మకంగా చేపట్టి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమర చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ వివరాలను వెల్లడించారు.
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది. ఇందుకోసం సరికొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకురాబోతోంది. వాట్సాప్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మొదట ఈ కార్యక్రమాన్ని తెనాలిలో ప్రయోగాత్మకంగా చేపట్టి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమర చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ వివరాలను వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ సిఆర్ఎస్ అమలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ మేరకు ఆయన నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని, రియల్ టైంలో సమాచారాన్ని సేకరించాలని సీఎం చంద్రబాబు గతంలో ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా సమర్థవంతమైన పాలన అందించేలా అన్ని శాఖలు సమాచారాన్ని ఆర్టిజిఎస్ సమీకృతం చేసి, మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని కూడా అధికారులు స్పష్టం చేశారు. మొదట ప్రతి శాఖలో సమాచార సేకరణ జరగాలని, తరువాత ఆ సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని సిఎస్ ఆదేశించారు. అంతిమంగా వాట్స్అప్ గవర్నమెంటు ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని సీఎం ఇప్పటికే నిర్దేశించారు.
ఈ మేరకు ప్రభుత్వ సేవలో ప్రజలకు మరింత సరళతరం చేయాలని దిశగా కూటమీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అందులో భాగంగానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 150 రకాల సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మొదట జనన, మరణ కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రారంభించి.. తర్వాత ఒక్కో షేక్ ను ఇందులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నీ కంప్యూటర్ సైజులు చేసి పేపర్ లెస్ వరకు ప్రారంభించిన కూటమి ప్రభుత్వం.. ఇక వాట్సాప్ లావణ్యన్స్ ద్వారా ప్రజలకు పౌర సేవలను మరింత చేరువ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ పథకాల అమలకు కీలకమైన ఆధార్ సేవలను ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లాలని చూస్తోంది. ఎందుకు అవసరమైన చెట్ల కొనుగోలు కోసం రూ.20 కోట్ల నిధులను సీఎం చంద్రబాబు మంజూరు చేశారు. మొత్తంగా ఏపీ సర్కార్ తీసుకువస్తున్న నూతన సేవలు వినియోగదారులకు ఎంతో మేలు చేకూర్చనున్నాయి. టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు చెబుతున్నారు.