ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఒకవైపు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసమీక్షిస్తూనే నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ప్రతి కుటుంబానికి సంబంధించి సమగ్రమైన సర్వే చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి ఇంటికి జియో టాగింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రామ, వార్డు సచివాలయాల
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఒకవైపు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసమీక్షిస్తూనే నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ప్రతి కుటుంబానికి సంబంధించి సమగ్రమైన సర్వే చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి ఇంటికి జియో టాగింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సర్వే ఆధారంగా డేటా బేస్ నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ కుటుంబ సర్వే వల్ల సమగ్రమైన సమాచారాన్ని పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ వాలంటీర్లు ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నిర్వహించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా ఆయా ఇళ్లను జియో మ్యాపింగ్ చేయడంతోపాటు కుటుంబంలోని వారి వివరాలను కూడా సర్వే ఆధారంగా డేటాబేస్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ సర్వేకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఈ సర్వే ఎప్పటి నుంచి చేయాలన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం మరోసారి దీనిపై సమీక్ష నిర్వహించి తేదీలను ఖరారు చేయనుంది. సర్వేను ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పటిలోగా పూర్తి చేయాలి అనే దానిపై కొద్దిరోజుల్లోనే ఉన్నతాధికారులు నుంచి గ్రామ, వార్డు సచివాలయాల అధికారులకు సమాచారం రానుంది. గడిచిన ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో కూటమి నాయకులు పలు హామీలను ఇచ్చారు.
ఈ హామీలను అమలు చేసేందుకు అనుగుణంగా రాష్ట్రంలోని లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు ఈ సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కొత్త పెన్షన్లు, నూతన రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను కొత్త ఏడాదిలో ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది. అలాగే నైపుణ్య గణన చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ సర్వేలో భాగంగా ఆయా వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం ద్వారా సంక్షేమ పథకాలు అమలు మరింత సులభతరం కావడంతోపాటు వివిధ వర్గాలకు సంబంధించిన డేటా ప్రభుత్వం వద్ద కచ్చితంగా ఉన్నట్టు అవుతుంది. దీనివల్ల సంక్షేమ పథకాల అమలుతోపాటు కీలక తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులకు చెక్ చెప్పే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సర్వేకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొత్త ఏడాదికి ముందే ఈ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే అందుకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తవుతుందో.? లేదా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రభుత్వం దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తే ఈ మేరకు సర్వే ప్రక్రియ ఎప్పటికీ పూర్తవుతుందో తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ సర్వే బాధ్యతను గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందికి అప్పగించనున్నారు. గతంలో వైసిపి ప్రభుత్వం సర్వే నిర్వహించినప్పుడు వాలంటీర్లు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం వాలంటీర్లను పక్కన పెట్టడంతో ఈ బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగిస్తుంది. ప్రభుత్వం చేపట్టనున్న కుటుంబ సర్వేతో పలు సంక్షేమ పథకాల అమలు ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతోమంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ తమ అర్హతను నిర్ధారించే రేషన్ కార్డులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గడచిన కొద్ది నెలల నుంచి రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. ఈ సర్వేను నిర్వర్తించడం ద్వారా ఈ తరహా ఇబ్బందులకు చర్చ చెప్పే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. వీలైనంత వేగంగా సర్వే ప్రక్రియను ప్రారంభించి పూర్తిచేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నప్పటికీ. విధివిధానాలు ఖరారు సంబంధించి జాప్యం జరుగుతుండడంతో సమస్య ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.