మండలిపై కూటమి ఫోకస్.. చేజారే నేతలపై వైసీపీ కన్ను, ఇక మిగిలేది ఎందరో.!

శాసన మండలిలో బలంగా వైసీపీ ఉండడంతో ఇక్కడ సమావేశాల్లో పాల్గొంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే, మండలిలో బలంగా ఉన్న వైసీపీని దెబ్బ కొట్టే ప్రయత్నాలను కూటమి చేస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడి కూటమి పార్టీలలో చేరిపోగా, మరి కొంతమంది కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీనీ టెన్షన్కు గురిచేస్తోంది.

Legislative Council

శాసన మండలి

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం తరువాత వైసిపి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఏన్నడూ లేని రీతిలో తీవ్రస్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒకవైపు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయి తీవ్ర అగాధంలో కూరుకుపోయిన వైసీపీని.. కోలుకోనీయకుండా రాష్ట్రంలోని కూటమి సర్కార్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వైసిపి నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఈ దాడులపై పోరాటం చేసేందుకు స్వయంగా జగన్మోహన్ రెడ్డి బరిలోకి దిగాల్సి వచ్చింది. ఈ దాడులు తగ్గుముఖం పట్టాయి అంటున్న తరుణంలో కీలక నేతలను వివిధ కేసులు పేరుతో కూటమి ప్రభుత్వం అరెస్టులు చేయించింది. దీంతో చాలామంది నాయకులు బయట మాట్లాడేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ వైసీపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ అసమర్ధతను, హామీలను విస్మరించిన తీరును ఎండగడుతున్న సామాజిక మాధ్యమాల కార్యకర్తలను వరుసగా అరెస్టు చేస్తూ వస్తున్నారు. ఇది కూడా వైసిపిని మరింత డిఫెన్స్ లోకి నెట్టింది. మరోవైపు గడిచిన కొన్నాళ్లుగా వైసీపీకి బలమైన సపోర్టర్స్ గా ఉంటూ వస్తున్న సినిమా రంగానికి చెందిన వారిని కూడా కూటమి ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే సినీ నటుడు అలీ, పోసాని కృష్ణ మురళి, శ్రీ రెడ్డి వంటి వారంతా రాజకీయాలకు దూరంగా ఉంటామంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఒకవైపు రాజకీయంగా ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న వైసీపీని మరింత దెబ్బ కొట్టేలా కూటమి ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. 

ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీకి పెద్దగా బలం లేదు. దీంతో వైసిపి అసెంబ్లీ సమావేశాలకు రావడమే మానేసింది. మండలిలో బలంగా వైసీపీ ఉండడంతో ఇక్కడ సమావేశాల్లో పాల్గొంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే, మండలిలో బలంగా ఉన్న వైసీపీని దెబ్బ కొట్టే ప్రయత్నాలను కూటమి చేస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడి కూటమి పార్టీలలో చేరిపోగా, మరి కొంతమంది కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీనీ టెన్షన్కు గురిచేస్తోంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీల్లో ఎంతమంది పార్టీలో ఉంటారో, ఎంతమంది పార్టీని వెడతారో తెలియని పరిస్థితి ఆ పార్టీ నేతల్లో ఉంది. ఇప్పటికే వైసీపీకి ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. తాజాగా ఏలూరు జిల్లాకు చెందిన జయ మంగళ వెంకటరమణ కూడా వైసిపికి గుడ్ బై చెప్పేసారు. ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి జయ మంగళ రాజీనామా చేశారు. ప్రస్తుతం శాసన మండలిలో టిడిపికి పదిమంది ఎమ్మెల్సీలు ఉండగా, వైసీపీకి 37 మంది ఉన్నారు. శాసనమండలిలో సంఖ్యాబలం పూర్తిగా వైసీపీకి ఉంది. అసెంబ్లీలో బలం లేకపోయినా శాసనమండలిలో ఉన్న బలం ద్వారా ఓటమి ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని వైసిపి భావిస్తూ వస్తోంది. అయితే ఇక్కడ ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే కూటమి నేతలు ఎమ్మెల్సీలపై దృష్టి సారించి పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. కూటమినేతలు చేస్తున్న ప్రయత్నాలతోనే ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు డొక్కా మాణిక్య వరప్రసాద్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సి రామచంద్రయ్య రాజీనామా చేశారు. ఎన్నికల తర్వాత కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, పోతుల సునీత రాజీనామా చేయగా, తాజాగా జయ మంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

వైసీపీని వీడేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న నేతలు జాబితాలో పలువురు పేర్లు ఉన్నాయి. వీరు పార్టీ వేడకుండా ఉండేలా పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతోంది. పార్టీ వీడుతారని భావిస్తున్న వారి జాబితాలో పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు, జఖియా ఖానం పేర్లు వినిపిస్తున్నాయి. రఘురాజు అనర్హత వ్యవహారం తేలిన తరువాత పార్టీ మార్పుపై వీరు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరితోపాటు మరికొంతమంది కూడా పార్టీ మారతారన్న ప్రచారము జరుగుతోంది.  పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్న నేతలను కాపాడుకునే ప్రయత్నాల్లో ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఉంది. పార్టీ మారే ఆలోచనలో ఉన్న నాయకులతో మంతనాలను ముఖ్య నాయకులు జరుపుతున్నారు. మరి వైసీపీ అధినాయకత్వం మండలిలో ఉన్న తన బలాన్ని నిలుపుకుంటుందో.. లేదో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్