అమెరికాను అల్లాడిస్తున్న కార్చిచ్చు.. ఇప్పటి వరకు 24 మంది మృతి

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికీ కార్చిచ్చు శాంతించకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రాంతం పై వరుసగా ఆరో రోజు కూడా కార్చిచ్చు ప్రతాపం చూపించింది. కార్చిచ్చు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 24 కు చేరింది. మరో పాతికమంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెబుతున్నారు. తీవ్రమైన గాలులు వీస్తుండడంతో మంటలు ఒకచోట నుంచి మరోచోటకు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అమెరికా చరిత్రలోనే అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీతంగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ అభివర్ణించారు.

Blazing flames

ఎగసిపడుతున్న మంటలు

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికీ కార్చిచ్చు శాంతించకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రాంతం పై వరుసగా ఆరో రోజు కూడా కార్చిచ్చు ప్రతాపం చూపించింది. కార్చిచ్చు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 24 కు చేరింది. మరో పాతికమంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెబుతున్నారు. తీవ్రమైన గాలులు వీస్తుండడంతో మంటలు ఒకచోట నుంచి మరోచోటకు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అమెరికా చరిత్రలోనే అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీతంగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ అభివర్ణించారు. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 24 మంది బలయ్యారు. వీరిలో పాలిషేడ్స్ లో 8 మంది, ఎటోన్లో 16 మంది మరణించారు. చనిపోయిన వాళ్ళలో కిడ్డీ కాపర్స్ ఫేమ్ నటుడు రోరి సైక్స్ కూడా ఉన్నాడు. కార్చిచ్చుతో ఆర్థికంగా వాటిలను నష్టం 150 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు కార్చిచ్చుతో 62 చదరపు మైళ్ళ విస్తీర్ణం దగ్ధమైందని అంచనా వేస్తున్నారు. 12 వేల నిర్మాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మరింతగా ఈ నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పి వేయడానికి స్థానిక అగ్నిమాపకదాలంతో పాటు కెనడా, మెక్షికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. మొత్తంగా 14,000 మంది సిబ్బంది, 1354 అగ్నిమాపక యంత్రాలు, 84 ఎయిర్ క్రాఫ్ట్ లు ఇందులో పాలుపంచుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే కార్చిచ్చు కారణంగా లాస్ ఏంజెల్స్ కౌంటిలో ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది నివాసాలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఇల్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి నిత్యవసరాలు, దుస్తులు అందించేందుకు దాతలు భారీగా ముందుకు వస్తున్నారు. ఇది ఎలా ఉంటే మంటలను ఆర్పేందుకు నీటి కొరత అక్కడ ప్రధాన సమస్యగా మారినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్టార్ల నిర్వాకం వల్లే లాస్ ఏంజెల్స్ లో ఈ దుస్థితి తలెత్తిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటిని ఇస్తారాజ్యంగా దుర్వినియోగం చేయడంతో మంటలను చల్లార్చినందుకు నీటి కొరత ఎదురవుతోందని చెబుతున్నారు. కొందరు స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడుకుంటున్నారని అక్కడ ప్రముఖ వార్తా సంస్థ వార్తను ప్రచురించింది. ఈ కార్చిచ్చు వల్ల అమెరికాలో తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. ఎంతోమంది ఆస్తులను కోల్పోవడంతో పాటు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అప్రమత్తమైన అమెరికా ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నష్ట నివారణ చర్యలకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఫస్ట్ పిక్ పాలిషేడ్స్ లో అన్ని హైడ్రెంట్లు పనిచేస్తున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ పేర్కొంది. 20 శాతం హైడ్రేంట్లలో నీటి ప్రెషర్ చాలక పోవడంతో కొన్నిచోట్ల ట్యాంకర్లతో నీటిని తరలిస్తూ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్