లాస్ ఏంజెల్స్ లో మళ్లీ మొదలైన కార్చిచ్చు.. నివాసాలు విడిచి వెళ్లాలని ఆదేశాలు

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కార్చిచ్చు మళ్లీ విజృంభిస్తుంది. గాలుల తీవ్రతతో వేగంగా వ్యాప్తి చెందుతున్న మంటలు వేలాది ఎకరాల్లో విస్తరిస్తున్నాయి. ఈ మంటలు కారణంగా చెట్లు, నివాస సముదాయాలు దగ్ధమవుతున్నాయి. ఉత్తర లాస్ ఏంజెల్స్ కు 80 కిలోమీటర్ల దూరంలోనే కాస్టియిక్ సరస్సు వెంబడి కొండల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గంటకు 67 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తుండడంతో గంటలు వ్యవధిలోనే ఈ మంటలు 39 చదరపు కిలో మీటర్లు విస్తీర్ణంలోని భూభాగాన్ని చుట్టుముట్టేసాయి. అగ్ని కీలలు అంతకు అంతకు విస్తరించడంతో కాస్టియిక్ సరస్సు వెంబడి ప్రాంతాల్లో నివసిస్తున్న 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు.

Fires caused by sparks

కార్చిచ్చు వల్ల చెలరేగిన మంటలు

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కార్చిచ్చు మళ్లీ విజృంభిస్తుంది. గాలుల తీవ్రతతో వేగంగా వ్యాప్తి చెందుతున్న మంటలు వేలాది ఎకరాల్లో విస్తరిస్తున్నాయి. ఈ మంటలు కారణంగా చెట్లు, నివాస సముదాయాలు దగ్ధమవుతున్నాయి. ఉత్తర లాస్ ఏంజెల్స్ కు 80 కిలోమీటర్ల దూరంలోనే కాస్టియిక్ సరస్సు వెంబడి కొండల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గంటకు 67 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తుండడంతో గంటలు వ్యవధిలోనే ఈ మంటలు 39 చదరపు కిలో మీటర్లు విస్తీర్ణంలోని భూభాగాన్ని చుట్టుముట్టేసాయి. అగ్ని కీలలు అంతకు అంతకు విస్తరించడంతో కాస్టియిక్ సరస్సు వెంబడి ప్రాంతాల్లో నివసిస్తున్న 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. 31 వేల మందిని ఉన్నపలంగా ఇల్లు ఖాళీ చేయమని ఆదేశించారు. మరో 23 వేల మందిని ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు. కార్చిచ్చు అత్యంత వేగంగా వ్యాపిస్తూ మంటలు చెలరేగుతుండడంతో వాటిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు.

లాస్ ఏంజెల్స్ లోనే హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో ఇటీవల కార్చిచ్చు చెలరేగి తీవ్ర నష్టాన్ని చేకూర్చిన విషయం తెలిసిందే. జనవరి ఏడో తేదీ నుంచి జరిగిన ఈ ఘటనల్లో 14 వేల నిర్మాణాలు దగ్ధం అయ్యాయి. 28 మంది ప్రాణాలను కోల్పోయారు. పాలిషేడ్స్ లో 68 శాతం, ఈటన్లో 91 శాతం మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. లాస్ ఏంజిల్స్ దక్షిణ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి వర్షాలు కురిచే అవకాశం ఉండడంతో మంటలు పూర్తిగా అదుపులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బూడిద, బురద ముప్పును ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లాస్ ఏంజెల్స్ లోని కార్చిచ్చు కారణంగా వేలాదిమంది ఇళ్లను నష్టపోవడంతోపాటు ఆస్తులను కోల్పోతున్నారు. హాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు ఎంతో నష్టపోయారు. ఇప్పటికే ఎంతోమంది లాస్ ఏంజెల్స్ ను విడిచి వెళ్లిపోయారు. మరోసారి మళ్లీ కార్చిచ్చు మొదలు కావడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ కార్చిచ్చు ఎప్పటిలోగా విముక్తి అవుతుందో తెలియడం లేదని స్థానికులు వాపోతున్నారు. కార్చిచ్చు కారణంగా ఆస్తులు కోల్పోవడంతోపాటు అర్థికంగాను తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్