ఏపీలో మరో స్కీమ్ అమలుకు రంగం సిద్ధం.. లబ్ధిదారులు ఎవరంటే.?

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఉచిత ఇసుక సరఫరాకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మందుబాబులకు తక్కువ ధరకే మద్యం విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన మరో కీలక హామీ అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు సరఫరా. ఈ పథకాన్ని దీపావళికి ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నారు.

Gas cylinder, CM Chandrababu Naidu

గ్యాస్ సిలిండర్,  సీఎం చంద్రబాబు నాయుడు

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతోంది. మరో హామీ అయినా ఉచిత ఇసుక సరఫరాకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే మందుబాబులకు తక్కువ ధరకే మద్యం విక్రయిస్తోంది. కొద్దిరోజుల్లోనే నూతన మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన మరో కీలక హామీ అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు సరఫరా. ఈ పథకాన్ని దీపావళికి ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈ పథకాన్ని ప్రస్తుతం తెలంగాణతో పాటు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అమలు చేస్తున్న విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కావాల్సిన నిధులు, లబ్ధిదారులు ఎంపిక వంటి అంశాలపై ప్రస్తుతం ఉన్నతాధికారులు పనిచేస్తున్నారు. ఈ పథకం అమలు చేయాలంటే ఎటువంటి విధానాలను అనుసరించాలన్న దానిపైన అధికారులు దృష్టి సారించి కార్యాచరణలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన నేపథ్యంలో దీపావళి పండుగకు ముందుగానే ఒక సిలిండర్ అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి తాము చెప్పినట్లుగా ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఈ పథకంలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక ఎలా అన్నదానిపై ప్రస్తుతం ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. రెండు, మూడు దశల్లో లబ్ధిదారులు ఎంపిక జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. తొలి దశలో అందించాల్సిన అర్హులకు సంబంధించిన విధి విధానాలను ప్రస్తుతం తయారు చేసి ఆ తరువాతే ఎవరైనా లబ్ధిదారులు ఉంటే మిగిలిన దశల్లో వారికి అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డు కలిగివున్న ప్రతి ఒక్కరిని అర్హులుగా గుర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా లబ్ధి పొందాలంటే ముందుగానే లబ్ధిదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనర్హులుగా మిగలకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి ఆధార్ బయోమెట్రిక్ కూడా చేయించుకోవాలి. ఎల్పిజి కనెక్షన్ కు ఆధార్ లింక్ చేయించుకోవాలి. ఇది రెండు నిమిషాల్లో పూర్తయ్యే పని. ఇలా చేయడం ద్వారా ఈ పథకం లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉండగలదు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఏజెన్సీలు లబ్ధిదారులను పిలిపించుకొని ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి. ఇంకా ఈ పని చేయించుకోకపోతే వెంటనే వెళ్లి చేయించుకోవాలని సూచిస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీలు ఈ ప్రక్రియను ముందుగానే ప్రారంభించాయి. కాబట్టి బయోమెట్రిక్ వేయించుకోవడంతోపాటు ఆధార్ లింక్ చేయించుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్