రెండు తెలుగు రాష్ట్రాలను కమ్మేస్తున్న జ్వరాలు.. ప్రతి ఇంటిలోనూ బాధితులు

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గడిచిన కొద్ది రోజుల నుంచి జ్వరాల బాధితులు పెరుగుతున్నారు. ప్రతి ఇంటిలోనూ ఒకరిద్దరూ జ్వర బాధితులు మంచాన ఉంటున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందుతూ ఉండడంతోపాటు డెంగ్యూ మాదిరి జ్వరాలు విజృంభిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మారిన వాతావరణం, కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వంటి కారణాలతో వైరల్ ఫీవర్సు విజృంభిస్తున్నాయి.

viral Fevers

జ్వర బాధితులు

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గడిచిన కొద్ది రోజుల నుంచి జ్వరాల బాధితులు పెరుగుతున్నారు. ప్రతి ఇంటిలోనూ ఒకరిద్దరూ జ్వర బాధితులు మంచాన ఉంటున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందుతూ ఉండడంతోపాటు డెంగ్యూ మాదిరి జ్వరాలు విజృంభిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మారిన వాతావరణం, కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వంటి కారణాలతో వైరల్ ఫీవర్సు విజృంభిస్తున్నాయి. ఈ జ్వరాలు బారిన పడుతున్న వారిలో ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటున్నాయి. ఇవన్నీ వైరల్ ఫీవర్స్ బాధితుల్లో లక్షణాలుగా కనిపిస్తున్నాయి. డెంగ్యూ తరహా జ్వరాల్లో అంటే డెంగ్యూ పరీక్ష చేస్తే నెగిటివ్ వస్తోంది. కానీ లక్షణాలు మాత్రం డెంగ్యూ మాదిరిగా తీవ్రమైన జ్వరంతోపాటు ఒళ్ళు నొప్పులు, చర్మంపై ఎర్రని దద్దుర్లు వంటివి రోగులను వేధిస్తున్నాయి. ఈ తరహా లక్షణాలు ఐదు రోజుల నుంచి వారం రోజులు వరకు ఉంటున్నాయి. కొందరిలో పది రోజులు వరకు ఉంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపించిన వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఒకరికి వస్తే వెంట వెంటనే మిగిలిన వారి కూడా ఈ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ఇంటిల్లపాది జ్వరాలతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఈ జ్వరాల వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలామందికి పడడం లేదు. అతి కొద్ది మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారు. డెంగ్యూ తరహా జ్వరాల్లో ప్లేట్లెట్స్ పడిపోతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. 50 వేల నుంచి లక్ష మధ్య ప్లేట్లెట్స్ పడిపోయి మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి 

వైరల్ ఫీవర్స్ బారినపడిన వాళ్ళు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వైద్యుల సలహా మేరకు మందులు వాడడంతో పాటు వేడి నీటిని తీసుకోవడం, వేడివేడి ఆహార పదార్థాలను తినడం చేయాలని సూచిస్తున్నారు. వీలైనంతవరకు బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నాలుగు రోజులకు మించి జ్వరం ఇతర లక్షణాలు ఉంటే తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. గతంతో పోలిస్తే జ్వర బాధితులు అధికంగా ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. జ్వరం ఇతర లక్షణాలు వారం నుంచి పది రోజుల్లో తగ్గినప్పటికీ ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన నీరసం సుమారు మూడు నుంచి నాలుగు వారాలపాటు వేధిస్తూ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చిన్నపిల్లల్లో దద్దుర్లు, ఆయాసంతో కూడిన జ్వరాలు వస్తున్నాయని, ఈ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే వారు ఐసోలేట్ కావడం వలన ఇతరులకు వ్యాప్తి చెందకుండా చేయవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చిన్నపాటి ఆరోగ్య చిట్కాలను పాటించడం ద్వారా వేగంగా కోలుకోవచ్చని సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్