దసరా పండుగ రోజున జమ్మి చెట్టును పూజించడంతోపాటు పాల పిట్టను కూడా చూడాలని పెద్దలు చెబుతుంటారు. విజయదశమి రోజున పాలపిట్టను ఎందుకు చూడాలని పెద్దలు చెబుతారో చాలా మందికి తెలియదు. కానీ పెద్దలు ఏది చెప్పినా దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. పాలపిట్టకు, దసరా పండుగకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అన్న దానిపై చాలామందికి అవగాహన లేదు.
పాల పిట్ట
దేశ వ్యాప్తంగా విజయదశమి పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగ అత్యద్భుతంగా జరుగుతుంది. దసరా పండుగను ఏపీలోని అనేక ప్రాంతాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారి మాల ధారణ ధరించి విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. అత్యంత పవిత్రంగా భావించే ఈ దసరా పండుగ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే భక్తుల సంఖ్య కోట్లల్లో ఉంటుంది. అటువంటి దసరా పండగ రోజున చేసే కొన్ని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా దసరా పండుగ రోజున జమ్మి చెట్టును పూజించడంతోపాటు పాల పిట్టను కూడా చూడాలని పెద్దలు చెబుతుంటారు. విజయదశమి రోజున పాలపిట్టను ఎందుకు చూడాలని పెద్దలు చెబుతారో చాలా మందికి తెలియదు. కానీ పెద్దలు ఏది చెప్పినా దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. దేశంలో హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగలో దసరా ఒకటి. పేద, ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఈ దసరా పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. దసరా పండగ రోజున ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించి వాహనాలను, పరికరాలను శుభ్రం చేసి వాటికి పూజలను నిర్వహిస్తుంటారు.
అనంతరం దేవుడిని దర్శించుకుని పాలపిట్టను చూసి జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. పాలపిట్టకు, దసరా పండుగకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అన్న దానిపై చాలామందికి అవగాహన లేదు. దీనిపై బ్రాహ్మణ పండితులు చెప్పిన దాని ప్రకారం.. విజయదశమి అంటే విజయానికి చిహ్నం అని, విజయానికి ముందు నవరాత్రులు నిర్వహిస్తారని వెల్లడించారు. అమ్మవారికి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఆయుధం ఇచ్చి తొమ్మిది రూపాయల్లో అమ్మవారిని కొలుచుకుంటారని బ్రాహ్మణ పండితులు వివరించారు. పదో రోజు విజయానికి చిహ్నంగా విజయదశమి నిర్వహించుకుంటారు. లోక కళ్యాణం కోసం మునులు, ఋషులు చేసే యజ్ఞ యాగాలను రాక్షసులు ధ్వంసం చేసేవారని పేర్కొన్నారు. రాక్షసుల నుండి మనుషులను, ఋషులను రక్షించడానికి అమ్మవారు అనేక రూపాల్లో వచ్చి వారిని కాపాడేది. అందులో భాగంగానే మహిషాసుడిని వధించాల్సి వచ్చినట్లు పండితులు పేర్కొంటున్నారు. రాక్షసుడు అయిన మహిషాసురుడిని వధించేందుకు అమ్మవారు వదిలిన బాణాలు కొన్ని యుద్ధం జరిగిన ప్రాంతంలో ఉన్న ఒక చెట్టుపై పడ్డాయి. అదే శమీ వృక్షమని, ఆ వృక్షం అమ్మవారికి శక్తిగా మారి అమ్మవారికి సహాయం చేసిందని చెబుతుంటారు. మహిషాసురుడి వధ తరువాత ఋషులు, మునులు ఆ శమీ చెట్టుకు పూజ చేస్తున్న సమయంలో అమ్మవారు పాలపిట్ట రూపంలో దర్శనమిచ్చి అక్కడ నుండి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పాలపిట్ట దర్శనమిచ్చిందంటే విజయాలకు చిహ్నం అని నమ్ముతుంటారు. అందుకే విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే విజయాలు అందుకుంటారని ప్రతీతి. దసరా రోజు ఉదయం లేచి దైవ దర్శనం చేసుకుని పాల పిట్టను దర్శించుకోవడం ద్వారా ప్రజలకు సుఖశాంతులు కలుగుతాయని బ్రాహ్మణ పండితులు పేర్కొంటున్నారు.