దేశంలోనే అనేక ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున భూమి కంపించింది. ఒక్కసారిగా భూకంపంతో ప్రజలు ఆందోళనలతో పరుగులు పెట్టారు. దేశంలోనే పలుచోట్ల ఒకేసారి భూకంపం చోటు చేసుకోవడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అయింది. మంగళవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ లో భూకంపం సంభవించింది. అలాగే బీహార్ రాజధాని పాట్నాలో స్వల్పంగా భూమి కంపించినట్లు గుర్తించారు. భూకంపం భూకంప కేంద్రం గోకర్ణేశ్వరకు సమీపంలో ఉందని చెబుతున్నారు.
ప్రతికాత్మక చిత్రం
దేశంలోనే అనేక ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున భూమి కంపించింది. ఒక్కసారిగా భూకంపంతో ప్రజలు ఆందోళనలతో పరుగులు పెట్టారు. దేశంలోనే పలుచోట్ల ఒకేసారి భూకంపం చోటు చేసుకోవడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అయింది. మంగళవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ లో భూకంపం సంభవించింది. అలాగే బీహార్ రాజధాని పాట్నాలో స్వల్పంగా భూమి కంపించినట్లు గుర్తించారు. భూకంపం భూకంప కేంద్రం గోకర్ణేశ్వరకు సమీపంలో ఉందని చెబుతున్నారు. దీని తీవ్రత రెక్టార్ స్కేల్ పై ఆరు నుంచి ఏడున్నట్లు తెలుస్తోంది. కాగా నష్ట తీవ్రత తెలియాల్సి ఉందని చెబుతున్నారు. మంగళవారం ఉదయం 6:40 గంటల ప్రాంతంలో భూమి కనిపించినట్లు ప్రజలు చెబుతున్నారు. ఒక్కసారిగా భూమి కనిపించడంతో ఇళ్లలోను ప్రజలు బయటకు పరుగులు తీశారు. అప్పటికే నిద్రలో ఉన్న ఎంతోమంది భూకంపంతో ఉలిక్కిపడే లేచారు. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు బయటకు వచ్చిన వాళ్లకు భూకంపం అని తెలియడంతో ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం 6:40 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు.
అదే సమయంలో నేపాల్, చైనాలోనూ భూకంపం వచ్చింది. నేపాల్ లో దీని తీవ్రత 6.5 గా ఉండగా, చైనాలో 6.9 గా నమోదయింది. నేపాల్ లోని లోబుచేకి ఉత్తర వాయువ్యంగా 84 కిలోమీటర్ల దూరంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని లోతు 10 కిలోమీటర్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వచ్చిన భూకంపం వల్ల జరిగిన నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. భూకంపం వచ్చిన సమయంలో ఆయా ప్రాంతాల్లో కొన్ని సెకండ్లపాటు ఇళ్లల్లోనే సామాన్లు కదిలినట్టు ప్రజలు చెబుతున్నారు. ఫ్యాన్లు ఊగాయని భయాందోళన చెందుతూ వెల్లడించారు. అయితే ఈ భూకంపం వల్ల పెద్ద నష్టాలు వాటిల్లో లేదని చెబుతున్నారు. భూకంపం ఎక్కడెక్కడ వచ్చిందంటే ఢిల్లీ, నోయిడా - గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురు గ్రామ్, పాట్నా, ముజఫర్ బాద్, వైశాలి, సీతామర్హీ, మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు చెబుతున్నారు.