తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గడచిన మూడు రోజులుగా వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం రావడంతో కొండపై రద్దీ నెలకొంది. క్యూ కాంప్లెక్స్ లోనీ 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 62,625 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరులో 34,625 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు.
తిరుమల
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గడచిన మూడు రోజులుగా వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం రావడంతో కొండపై రద్దీ నెలకొంది. క్యూ కాంప్లెక్స్ లోనీ 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 62,625 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరులో 34,625 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. స్వామివారికి కానుకుల రూపంలో హుండీలో రూ.3.63 కోట్ల రూపాయలను సమర్పించారు. టైం స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం అవుతుండగా టికెట్లు లేని వారికి 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. గంటలు తరబడి వేచి ఉండాల్సి రావడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు నుంచి నాలుగు గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు అంతకన్నా ముందే వెళ్తే లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆదివారం కూడా భక్తులు రద్దీ కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. శ్రావణమాసం కావడంతో వివాహాలు చేసుకున్న వారు, వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తుండడంతో రద్దీ నెలకొన్నట్లు చెబుతున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ భక్తులకు అవసరమైన నీటిని అందిస్తున్నారు. చిన్నారులకు పాలు కూడా అందిస్తున్నట్లు టిటిడి అధికారులు చెబుతున్నారు.