మహారాష్ట్రలో వచ్చే నెలలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేయగా.. నామినేషన్లు దాఖలు చేసే గడువు మంగళవారంతో ముగిసింది. ఈ రాష్ట్రంలోని 288 స్థానాలకుగాను సుమారు 8,000 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నవంబర్ 20న ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాలకు సంబంధించి 7,995 మంది అభ్యర్థులు ఎన్నికల సంఘానికి 10,905 నామినేషన్లు దాఖలు చేశారు.
మహారాష్ట్రలోని ముఖ్య నాయకులు
మహారాష్ట్రలో వచ్చే నెలలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేయగా.. నామినేషన్లు దాఖలు చేసే గడువు మంగళవారంతో ముగిసింది. ఈ రాష్ట్రంలోని 288 స్థానాలకుగాను సుమారు 8,000 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నవంబర్ 20న ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాలకు సంబంధించి 7,995 మంది అభ్యర్థులు ఎన్నికల సంఘానికి 10,905 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వివరాలను వెల్లడించింది. అక్టోబర్ 22న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 29 తో ముగిసింది. నామినేషన్ పత్రాలు పరిశీలన అక్టోబర్ 30న జరగనుంది. అభ్యర్థులు నవంబర్ 4వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. భారతీయ జనతా పార్టీ 148 స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే ముఖ్యమంత్రి ఏక్ నాథ్ సిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి 53 మంది అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది.
మహాయుతి ఇతర మిత్రపక్షాలకు ఐదు సీట్లు ఇచ్చింది. రెండు సీట్లపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే ప్రతిపక్షం మహా వికాస్ అఘాడిలో కాంగ్రెస్ 13 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూటీవీ) 89 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎన్సీపీ (ఎస్పి) 87 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇతర ఎంబీఏ మిత్రపక్షాలకు ఆరు సీట్లు కేటాయించారు. మరో మూడు అసెంబ్లీ స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. వీటితోపాటు అసదుద్దీన్ ఓవైసీ పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 14 చోట్ల పోటీ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎందుకంటే శివసేన, ఎన్సీపీ పార్టీలు రెండుగా చీలిపోయి రెండు కాంగ్రెస్ పార్టీతో, ఇంకో రెండు బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడ ప్రజలు ఎటువంటి తీర్పును ఇస్తారు అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. ఎన్నికలు బిజెపితోపాటు కాంగ్రెస్ కూడా అత్యంత కీలకం. ఇక్కడ విజయం సాధించడం ద్వారా 2029లో జరిగే ఎన్నికలకు రోడ్డు మ్యాప్ క్లియర్ చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడం ద్వారా బిజెపికి దేశంలో తిరుగు లేదన్న విషయాన్ని మరోసారి తెలియజేయాలన్న ఉద్దేశంతో బిజెపి ఉంది. మరి ఇక్కడ ఓటర్లు బిజెపికి అవకాశం ఇస్తారో, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమిని అక్కున చేర్చుకుంటారో చూడాల్సి ఉంది.