దేశ వ్యాప్తంగా గడిచిన కొద్ది రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతోపాటు మంచు పెద్ద ఎత్తున కురుస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోనూ, ఏజెన్సీలోను చలి తీవ్రత మరింత అధికంగా ఉంది. గడిచిన వారం రోజుల నుంచి చలి తీవ్రత గణనీయంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే, దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో పొగ మంచులో వాహనాలు
దేశ వ్యాప్తంగా గడిచిన కొద్ది రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతోపాటు మంచు పెద్ద ఎత్తున కురుస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోనూ, ఏజెన్సీలోను చలి తీవ్రత మరింత అధికంగా ఉంది. గడిచిన వారం రోజుల నుంచి చలి తీవ్రత గణనీయంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే, దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చలితోపాటు మంచు దట్టంగా కురుస్తుండడంతో అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉత్తర భారతంపై చలి పంజా విసురుతుండడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంచు దట్టంగా కురుస్తుండడం వల్ల ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ పొగ మంచు కమ్మేసింది. దీనివల్ల సాధారణ వాహనాలతోపాటు విమానం, రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో దృశ్యత సున్నాకు పడిపోవడంతో దాదాపు 200కుపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 19 విమానాలను దారి మళ్లించినట్లు, మరో 30 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పొగ మంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, విమాన సమయాల కోసం ప్రయాణికులు ఎప్పటికప్పుడు సంబంధిత ఎయిర్లైన్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు కూడా ప్రయాణికులకు అడ్వైజరిలు జారీ చేశాయి. కోల్కతా, చండీగఢ్, అమృత్సర్, జైపూర్ సహా ఉత్తర భారతదేశంలోని పలు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కోల్కతా విమానాశ్రయంలో 25 విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది మరోవైపు మంచు కారణంగా రైల్వే సేవలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఢిల్లీకి వెళ్లే దాదాపు 50కిపైగా రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, కర్నాల్, ఘజియాబాద్ తదితర ప్రాంతాల్లో ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనాల రాకపోకలపై ప్రభావం పడి ఆనేక చోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. గడిచిన వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అనేక చోట్ల ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయం 9 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలోని పాడేరు వంటి ప్రాంతాలకు వచ్చే సందర్శకులు మంచు ప్రభావం, చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత కాస్త కనిపిస్తుండడంతో ప్రయాణికులు అప్పుడు మాత్రమే బయటకు వచ్చి పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. మరి కొద్ది రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.