హామీలు అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం : వై వి సుబ్బారెడ్డి

ఏపీలో గడిచిన ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని వైసిపి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియా సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలను గుప్పించారు. యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉందని ఆరోపించారు. యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతోపాటు నిరుద్యోగులను తీవ్ర స్థాయిలో మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు.

MP Yv Subbareddy

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 

ఏపీలో గడిచిన ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని వైసిపి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియా సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలను గుప్పించారు. యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉందని ఆరోపించారు. యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతోపాటు నిరుద్యోగులను తీవ్ర స్థాయిలో మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. అందుకే హామీలను అమలు చేయాలన్న డిమాండ్ తో ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటేకరించేందుకు ఓటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని, దీనిపైన పోరాటాలను సాగిస్తామన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం నాణ్యమైన వైద్యం అందించాలని జగన్మోహన్ రెడ్డి పరితపించారని, అందుకు అనుగుణంగా 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారన్నారు.

అయితే అయిదు కాలేజీలను ఇప్పటికే ప్రారంభించామని, మిగిలిన కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రారంభించేందుకు మీనమేషాలు లెక్కిస్తుందని ఆరోపించారు. ఈ  మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమవుతుందని, ఇది దారుణమని వ్యాఖ్యానించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని సుబ్బారెడ్డి ఆరోపించారు. మూడు క్వార్టర్లు పూర్తయిన ఇప్పటివరకు ఫీజులు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులను వేధిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి నిధులు ఇచ్చేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ భృతి పేరుతో నేలకు 3000 ఇస్తామంటూ యువతను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో వ్యవస్థలన్నీ నిర్వీర్య ప్రమాదం నెలకొందన్నారు. ప్రభుత్వ విధానాలపై తాము నిరంతరం పోరాటాలను సాగించి ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగించే వైసీపీకి ప్రజలు అండగా ఉండాలన్నారు. రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. ఎప్పటికీ అయినా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్