ఢిల్లీ ఎన్నికలకు మోగిన నగారా.. ఫిబ్రవరి 5న నిర్వహించేలా షెడ్యూల్.!

దేశ రాజధాని ఢిల్లీకి ఎన్నికలు నగారా మోగింది. వచ్చేనెల 5వ తేదీన పోలింగ్ నిర్వహించినట్లు భారత ఎన్నికల కమిషన్ (ఈసిఐ) ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వివరించింది. ఆ తరువాత నామినేషన్లను స్వీకరించనున్నారు. 17వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. 18 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 20వ తేదీ లోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తున్నట్లు ఈసీఐ ప్రకటించింది.

Iconic image

ప్రతికాత్మక చిత్రం

దేశ రాజధాని ఢిల్లీకి ఎన్నికలు నగారా మోగింది. వచ్చేనెల 5వ తేదీన పోలింగ్ నిర్వహించినట్లు భారత ఎన్నికల కమిషన్ (ఈసిఐ) ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వివరించింది. ఆ తరువాత నామినేషన్లను స్వీకరించనున్నారు. 17వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. 18 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 20వ తేదీ లోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తున్నట్లు ఈసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 5న పోలింగ్ను నిర్వహిస్తామని, అదే నెల ఎనిమిదో తేదీన కౌంటింగ్, ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తుంది. ఢిల్లీలో రెండు లక్షల మంది కొత్త ఓటర్లను కలుపుకొని 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసిఐ వెల్లడించింది. మొత్తంగా 70 అసెంబ్లీ స్థానాల్లో 12 సీట్లు ఎస్సి రిజర్వ్ కేటగిరిలో ఉన్నాయి. ఢిల్లీలో మోడల్ కోడ్ అమల్లోకి వచ్చింది. 85 ఏళ్లకుపైగా వయసున్న ఓటర్లకు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.

ఎన్నికల షెడ్యూల్  పెద్ద ఎత్తున ఎన్నికలకు సిద్ధం కావాలి అంటూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. 'ఫిర్ లాయింగే కేజ్రీవాల్' అనే పాటను తమ ప్రచార గీతంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం అతీశ్ ఒక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తన అధికారిక నివాసాన్ని లాక్కుందని వ్యాఖ్యానించారు. తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని ప్రజా పనులశాఖ రద్దు చేయడంతో ఆమె ఈ మేరకు ఆరోపణలు చేశారు. అధికారిక నివాసం తన కోసం కాదనే ఢిల్లీ ప్రజల కోసం వీధిలో ఉండడానికైనా సిద్ధమని తాను ఎక్కడ నుంచైనా పనిచేస్తానని స్పష్టం చేశారు. బిజెపి ఈ ఆరోపణలను తోసి పుచ్చింది. ఇచ్చిన గడువులోగా ఢిల్లీ సీఎం ఆ నివాసంలో చేరకపోవడం రద్దుకు కారణంగా పేర్కొంది. సిబిఐ, ఈడి విచారణలో మరో కారణమని తెలిపింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్