బెంగాల్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. రెండు గంటలకోసారి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో గల ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విద్యార్థులపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిబిఐ కు దర్యాప్తు బాధ్యతను అప్పగించింది. కేంద్రం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడంతో పలువురు దుండగులు ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి సుమారు వేయి మందికిపైగా ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారు.

Doctors are agitating

బెంగాల్ ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న వైద్యులు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో గల ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విద్యార్థులపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిబిఐ కు దర్యాప్తు బాధ్యతను అప్పగించింది. కేంద్రం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడంతో పలువురు దుండగులు ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి సుమారు వేయి మందికిపైగా ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆసుపత్రిలోని ఫర్నిచర్ దెబ్బతింది. అత్యాచారానికి సంబంధించిన ఆధారాలను నాశనం చేసేందుకే ఈ తరహా దాడికి పాల్పడ్డారు అన్న విమర్శలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఈ తరహా దాడులను అరికట్టేందుకు కఠిన చట్టాలను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ దేశ వ్యాప్తంగా వైద్యులతోపాటు అన్ని వర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే సిబిఐకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

దర్యాప్తు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. అదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్, ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపించాలని హోంశాఖ ఆదేశించింది. వీటి ద్వారా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అత్యాచారం జరిగిన ఆసుపత్రిలో సంబంధిత అధికారుల నుంచి సరైన సమాచారం, మద్దతు లేకపోవడం, పోలీసుల నిందితుడికి సహకరిస్తున్నారని ఆరోపణలు నేపథ్యంలో ఈ కేసును కోర్టు సిబిఐకు అప్పగించింది. ఈ ఘటన నేపథ్యంలోనే ఇటీవల దేశంలోని అన్ని వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది జాతీయ స్థాయిలో డాక్టర్లు వైద్య విద్యార్థులు కళాశాల ఆసుపత్రి పరిసరాల్లో భద్రతకు తగిన విధానాన్ని రూపొందించాలని సూచించింది ఈ రక్షణ చర్యలు ఓపిడి వార్డులు క్యాజువాలిటీ హాస్టల్స్ నివాస ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉండేలా చూడాలని తెలిపింది వైద్యులు సిబ్బంది కారిడార్లలో తిరిగే సమయంలోను భద్రత ఉండేలా తగినంత రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాలని పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్