కొత్త ఏడాదిలో రైతులకు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇకపై పీఎం కిసాన్ పదివేలు

దేశ వ్యాప్తంగా రైతులు, పేదలకు ప్రధాని నరేంద్ర మోడీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్న దాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రధాని మోదీ వెల్లడించారు. దేశంలోని పేదల కోసం రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే చేయాలని ఆయన నిర్ణయించారు. 2019 నుంచి మోడీ సర్కారు ఏటా రైతులకు రూ.6000 పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తోంది. రైతులకు రెండు వెలు చొప్పున మూడు విడతల్లో అన్నదాతల ఖాతాల్లో చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు పదివేలకు పెంచుతున్నట్లు ప్రధాన మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

దేశ వ్యాప్తంగా రైతులు, పేదలకు ప్రధాని నరేంద్ర మోడీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్న దాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రధాని మోదీ వెల్లడించారు. దేశంలోని పేదల కోసం రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే చేయాలని ఆయన నిర్ణయించారు. 2019 నుంచి మోడీ సర్కారు ఏటా రైతులకు రూ.6000 పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తోంది. రైతులకు రెండు వెలు చొప్పున మూడు విడతల్లో అన్నదాతల ఖాతాల్లో చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు పదివేలకు పెంచుతున్నట్లు ప్రధాన మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారు ఖాతాల్లో నేరుగా రూ.10 వెలు జమ చేయనున్నట్లు ప్రకటించారు. కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మల త్వరలో ప్రవేశపెట్టే 2025 - 26 బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఇప్పటికే వెల్లడించాయి. దానికి ముందే ఆ మొత్తాన్ని పది వేలకు పెంచుతున్నట్లు ప్రధాన స్వయంగా ప్రకటించడం గమనార్హం. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆరేళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. రైతులకు పంట సాయం కింద బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు కేంద్రం 18 వాయిదాలు చెల్లించింది. కొత్త ఏడాదిలో ఫిబ్రవరిలో 19వ వాయిదా జమ కోసం రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో ప్రధాని ప్రకటన వారిలో ఆనందోత్సాహాలను నింపింది. ఈ నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులకు మేలు చేకూరనుంది.

ఇదిలా ఉంటే దేశంలోని పేదల కోసం మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించే విషయంపై సర్వే జరిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన మోడీ తరఫున నూతన సంవత్సర కానుకగా ఈ నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31లోపు ఈ సర్వే పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాధాన్య ప్రాతిపదికన ఈ సర్వేను మూడు నెలల్లో పూర్తి చేయాలంటూ డిసెంబర్ 27న కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆవాస్ 2024 పేరిట రూపొందించిన యాప్ లో ప్రజలు స్వయంగా సర్వేలో పాల్గొనేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. గడిచిన సెప్టెంబర్ లో ప్రధాన మోడీ ఈ యాప్ ను ప్రారంభించారు. ఆధార్ ఆధారిత ఈ కేవైసీ ద్వారా ప్రజలు సర్వేలో పాల్గొనే అవకాశం కల్పించారు. కాగా పేదలకు మరో మూడు కోట్ల ఇల్లు నిర్మిస్తామని, బిజెపి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే, రాబోయే నాలుగేళ్లలో అదనంగా రెండు కోట్ల ఇల్లు నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్లు గ్రామీణ అభివృద్ధి శాఖ మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. మొత్తం 3.33 కోట్ల ఇళ్లను రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించగా, అందులో 3.22 కోట్ల ఇల్లు మంజూరయ్యాయని 2.68 కోట్ల ఇల్లు నిర్మించారని వెల్లడించింది. తాజా నిర్ణయం వల్ల ఆ దేశంలోని కోట్లాది మంది ఇల్లు లేని నిరుపేదలకు మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్