బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసిన కేంద్రం.. జెడియుకు తప్పని షాక్

ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియు పార్టీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కొద్ది రోజుల కిందట నితీష్ కుమార్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడంతో బీహార్ కు ప్రత్యేక హోదా ప్రకటన వస్తుందని జెడియు భావించింది. అయితే, అందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ స్పష్టం చేసింది.

Nitish Kumar with PM Modi

ప్రధాని మోదీతో నితీష్ కుమార్

ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియు పార్టీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కొద్ది రోజుల కిందట నితీష్ కుమార్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడంతో బీహార్ కు ప్రత్యేక హోదా ప్రకటన వస్తుందని జెడియు భావించింది. అయితే, అందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ స్పష్టం చేసింది. దీనిపై సోమవారం లోక్ సభలో స్పష్టమైన వైఖరిని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. బడ్జెట్ పార్లమెంటు సమావేశాలకు సన్నాహకంగా ఆదివారం జరిగిన అఖిలపక్ష పార్టీలు సమావేశంలో ఎన్డీఏ ముఖ్య భాగస్వామి బీహార్ అధికార పక్షం జేడీయు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించింది. ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీని బీహార్ నుంచి జార్ఖండ్ ను విభజించిన నాటి నుంచి తమ కోరుతున్నామని జేడీయూ నేత మనోజ్ కుమార్ ఝా వివరించారు.

కేంద్రం బీహార్ ను చౌక పరిశ్రమల సరఫరా దారుగానే చూస్తోందనీ, ఆ దృష్టి మారాలనీ ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగా తాము ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర విధానం మారాలని కోరుకుంటున్నామని, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండు బీహార్ కు ఇవ్వాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రాలకు ప్రత్యేక హోదాపై తన పాత వైఖరి మోడీ ప్రభుత్వం పునరుద్ధాటించింది. పర్వత ప్రాంతాలు, తక్కువ జనాభా, అధిక సంఖ్యలో గిరిజన జనాభా, సరిహద్దులు, ఆర్థిక మౌలిక సదుపాయాల్లో వెనుకబాటుతనం, రాష్ట్ర నిధులు ఏమాత్రం సరిపోకపోవడం వంటి సమస్యలు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలని జాతీయ అభివృద్ధి మండల నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్ సభలో స్పష్టం చేశారు. ఈ లక్షణాలు బీహార్ కు లేవని, అందుకే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించదని స్పష్టం చేశారు. కాగా, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పొందే అర్హత లేదని తెలుస్తోంది. బీహార్ కు ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తే అదే బాటలో ఏపీ కూడా పైనుంచి ప్రత్యేక హోదాను డిమాండ్ చేయాలన్న భావనను రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది. అయితే, బీహార్ కు ప్రత్యేక హోదా కల్పించే ప్రసక్ చేయలేదని స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఆలోచించే అవకాశం లేదని తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే ఆర్థికంగా పునరుత్తేజం కల్పించినట్లు అవుతుందని అంతా భావించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కారణంగా రాష్ట్రానికిగాని, ఇతర రాష్ట్రాలకుగాని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితులు లేవని స్పష్టమవుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్