156 రకాల మందులు వినియోగంపై కేంద్రం నిషేధం.. రోగులకు ముప్పు ప్రమాదంతోనే నిర్ణయం

దేశంలో ఏదైనా నొప్పి వస్తే నేరుగా మెడికల్ షాప్ కు వెళ్లి మందులు వేసుకునే సంప్రదాయం ఎక్కువగా ఉంది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే చాలా మంది విరివిగా మందులు వినియోగిస్తుంటారు. ఈ తరహా వినియోగం వలన అనేక ఇబ్బందులు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్న చాలామంది పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కొన్ని రకాల మందులు తీసుకోవడం వలన రోగులు ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది.

medicines

మందులు

దేశంలో ఏదైనా నొప్పి వస్తే నేరుగా మెడికల్ షాప్ కు వెళ్లి మందులు వేసుకునే సంప్రదాయం ఎక్కువగా ఉంది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే చాలా మంది విరివిగా మందులు వినియోగిస్తుంటారు. ఈ తరహా వినియోగం వలన అనేక ఇబ్బందులు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్న చాలామంది పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కొన్ని రకాల మందులు తీసుకోవడం వలన రోగులు ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రోగుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అవకాశం ఉందని భావించిన 156 రకాల ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వీటిని ప్రధానంగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు మందులుగా వాడుతుంటారు. రెండు అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను (కాంబినేషన్ డ్రగ్స్) కాక్టెయిల్ డ్రగ్స్ అని కూడా వ్యవహరిస్తారు. ఎసేక్లో ఫినాక్ 500 ఎంజి + పారాసెట్మాల్ 125 ఎంజి మాత్రలను, మెఫనమిక్ యాసిడ్ + పారాసెట్మాల్ ఇంజక్షన్ + ఫినైలెప్రైన్ హెచ్సిఎల్, లివోసిట్రిన్ + ఫినైలెప్రైన్ + హెచ్సిఎల్ + పారాసెట్మాల్ వంటి నిషేధిత మందులు జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదలైంది.

సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్సడ్ కాంబినేషన్ (ఎఫ్డిసి) ఔషధాలను వాడడం ప్రమాదాన్ని ఆహ్వానించడమే అవుతుందని అభిప్రాయంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వీటి తయారీ, అమ్మకం, పంపిణీలను నిషేదించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. వీటి విక్రయాలను పూర్తిగా నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరహా మందులు వినియోగం వలన భవిష్యత్తులో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావన కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 156 రకాల మందుల విక్రయాలపై బ్యాన్ విధించాలని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఔషధ నియంత్రణ విభాగానికి చెందిన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టం చేశారు. ఈ తరహా మందులను ప్రెస్క్రిప్షన్ చేయకుండా వైద్యులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది. అదేవిధంగా మందులు దుకాణాల్లో కూడా వీటిని నిల్వలు లేకుండా చూడాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఔషధ నియంత్రణ విభాగానికి చెందిన అధికారులు వీటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రజల్లో కూడా వీటి వినియోగం పట్ల అవగాహనను కలిగించనున్నట్లు ఒక అధికారి వెల్లడించారు. ప్రజల్లో అవగాహన తీసుకురావడం ద్వారా వీటిని వినియోగ నియంత్రణకు అడ్డుకట్ట వేయవచ్చు అన్న భావనను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్