మాజీ ప్రధాని, దేశాన్ని సంస్కరణల బాట పట్టించిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల దేశవ్యాప్తంగా సంతాపాలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే దేశంలోనే వివిధ పార్టీలకు చెందిన అగ్ర నాయకులు తమ సంతాప సందేశాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. దేశాన్ని ఒక ఆర్థిక సంస్కరణల రూప శిల్పిగా, గొప్ప మేధావిగా ప్రజల చేత కొనియాడబడిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అంటూ అనేకమంది ప్రశంసించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
మాజీ ప్రధాని, దేశాన్ని సంస్కరణల బాట పట్టించిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల దేశవ్యాప్తంగా సంతాపాలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే దేశంలోనే వివిధ పార్టీలకు చెందిన అగ్ర నాయకులు తమ సంతాప సందేశాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. దేశాన్ని ఒక ఆర్థిక సంస్కరణల రూప శిల్పిగా, గొప్ప మేధావిగా ప్రజల చేత కొనియాడబడిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అంటూ అనేకమంది ప్రశంసించారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సహా రాజకీయ సినీ, వ్యాపార, క్రీడ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు పాటు సంతాప జనాలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ మండలి శుక్రవారం ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. ఈ క్యాబినెట్ భేటీలో దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర మంత్రివర్గం సంతాపం తెలపనుంది. దేశం కష్టాల్లో ఉన్న సమయంలో తన ఆర్థిక విధానాలతో కొత్త పొంతలు తొక్కించిన మన్మోహన్ సింగ్ అంటే అన్ని పార్టీలకు ఇష్టమే. ఆయనను గొప్ప మేధావిగా హార్దిక చాణిక్యుడుగా పేర్కొంటారు. మన్మోహన్ సింగ్ కు భార్య గురు శరన్ కౌర్ ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడిన ప్రముఖులు..
మన్మోహన్ సింగ్ మృతి పట్ల దేశంలోని అగ్రనేతలంతా తమ సంతాప సందేశాలను తెలియజేశారు. 'మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. దేశానికి ఆయన చేసిన సేవా రాజకీయ జీవితం వినియంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయి' అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 'మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారు. ఆర్థిక సరళీకరణ రూపశిల్పి. కఠిన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారు' అంటూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ పేర్కొన్నారు. 'మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడును కోల్పోయింది. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన గొప్ప ఆర్థిక వేత్తగా ఎదిగారు. దేశ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విశేషంగా కృషి చేశారు' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తమ సంతాప సందేశాన్ని దేశ ప్రజలకు తెలియజేశారు. ' గురువును, మార్గదర్శకుడుని కోల్పోయాను. అపార జ్ఞానం సమగ్రతతో ఆయన దేశాన్ని నడిపించారు' అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 'దేశం దూర దృష్టి కలిగిన రాజనీతిజ్ఞుణ్ణి కోల్పోయింది. ఆయన ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయి' అంటూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. 'దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మన్మోహన్ సింగ్ చిరస్మరణీయులు. ఆయన నిబద్ధత, క్రమశిక్షణ, నిరాడంబరత అందరికీ ఆదర్శం' అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
నిజాయితీకి నిలువెత్తు రూపం మన్మోహన్ సింగ్..
మన్మోహన్ సింగ్ అంటే నిజాయితీకి నిలువెత్తు రూపం. ఈ విషయాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ అంగీకరిస్తారు. నిజాయితీకి, నిబద్ధతకు మన్మోహన్ సింగ్ నిలువెత్తు ప్రతిరూపం అంటారు ప్రముఖ రచయిత కుస్వంత్ సింగ్. '1999లో ఆయన ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో పోటీ అంటే మాటలు కాదు. అప్పటి వరకు పెద్ద ఉద్యోగాల్లో ఉన్న ఆయన వద్ద డబ్బు ఉండేది కాదు. ఎన్నికల ఖర్చు కోసం రెండు లక్షల కావాలని అడిగారు. ఆయన అల్లుడికి ఇచ్చి డబ్బు పంపాను. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ మరుసటి రోజే నాకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చారు. డబ్బు నా చేతిలో పెట్టి ఖర్చు కాలేదు. అలానే ఉంది తీసుకోండి. థాంక్స్ అని వెళ్ళిపోయారు. అలాంటి మనుషులు అరుదుగా ఉంటారు' అని కుస్వంత్ సింగ్ పేర్కొన్నారు. పదేళ్లపాటు దేశానికి ప్రధానిగా పని చేసినప్పటికీ, ఉన్నత ఉద్యోగాన్ని చేసినప్పటికీ, ఆర్థిక మంత్రిగా పని చేసినప్పటికీ మన్మోహన్ సింగ్ సాదాసీదా జీవితాన్ని గడిపేందుకే ఇష్టపడేవారు. పాత మారుతి 800 కారు, ఢిల్లీ, చండీఘర్ లో రెండు అపార్ట్మెంట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్లు ఇవి మాత్రమే ఆయన సంపాదించుకున్న ఆస్తి. అంటే ఆయన ఎంత నిజాయితీ, నిబద్ధతతో పనిచేశారు అర్థం చేసుకోవచ్చు.