ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం.. భారీగా ఆర్థిక సంఘం గ్రాంట్ నిధులు మంజూరు

కేంద్ర ప్రభుత్వం ఏపీకి శుభవార్తను అందించింది. ఆర్థిక సంఘం గ్రాంట్ నిధులను తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడత బకాయిల కింద రూ.25 కోట్లు, రెండో విడతలో రూ.421 కోట్లను ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ మేరకు రూ.446 కోట్ల నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రెండో వాయిదా కింద రూ.421 కోట్లతోపాటు తొలి వాయిదా కింద పెండింగ్ లో ఉన్న రూ.25 కోట్లను కూడా కేంద్రం విడుదల చేసింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వం ఏపీకి శుభవార్తను అందించింది. ఆర్థిక సంఘం గ్రాంట్ నిధులను తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడత బకాయిల కింద రూ.25 కోట్లు, రెండో విడతలో రూ.421 కోట్లను ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ మేరకు రూ.446 కోట్ల నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రెండో వాయిదా కింద రూ.421 కోట్లతోపాటు తొలి వాయిదా కింద పెండింగ్ లో ఉన్న రూ.25 కోట్లను కూడా కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రంలోని 13,097 పంచాయతీలకు, 650 బ్లాక్ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఈ గ్రాంట్ నిధులను కేటాయించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖలలో ప్రభుత్వం ఈ నిధులను ఖర్చు చేయనుంది. ఏపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు దృష్టి సారించింది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి భారీగా నిధులు అందాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అక్టోబర్ నెలలో తొలి విడత నిధులను విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అన్ టైడ్ గ్రాంట్స్ కింద రూ.395 కోట్లు, టైడ్ గ్రాంట్స్ కింద రూ.593.26 కోట్లు విడుదల చేసింది. తొలి విడతలో ఏపీకి కేటాయించిన నిధులలో రూ.25 కోట్లు పెండింగ్ లో ఉంచారు. రాష్ట్రంలో 12,583 గ్రామ పంచాయతీలకు, 615 మండల పంచాయతీలకు ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ లో పొందుపరిచిన అంశాల ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం గ్రాంట్స్ నిధులు విడుదల చేస్తుంది. వీటిలో టైడ్ గ్రాంట్స్ ను ఓడిఎఫ్, పారిశుధ్యం, నీటి యాజమాన్యం, వాననీటి సంరక్షణ, మురుగునీటి రీసైక్లింగ్, ఇళ్ల నుంచి వెలువడిన వ్యర్ధాల శుద్ధికి వినియోగించాల్సి ఉంటుంది.

 అన్ టైడ్ గ్రాంట్స్ ను పారిశుధ్యం, విద్య, వ్యవసాయం, గ్రామాల్లో గృహ నిర్మాణం వంటి పనులు కోసం వినియోగించాల్సి ఉంటుంది. పంచాయతీల్లో స్థానిక అవసరాల కోసం ఈ నిధులు ఉపయోగించాలి. అంతేకానీ ప్రభుత్వం వీటిని ఉద్యోగుల జీత, భత్యాలు, ప్రభుత్వ ఇతర ఖర్చుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ దారి మళ్లించకూడదు. తాజాగా ఇచ్చిన రెండో విడత గ్రాంట్ నిధులు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన శాఖలకు చెందిన కావడంతో ఆయన చొప్పునట్లుగానే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు ఈ మొత్తాలను వెచ్చించే అవకాశం ఉంది. ఇప్పటికే రహదారులు, ఇతర అవసరాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఈ మొత్తాలను పవన్ కళ్యాణ్ వినియోగించే అవకాశం ఉందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం  భారీ మొత్తంలో నిధులు మంజూరు చేస్తుండడంతో కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా రోడ్ల నిర్మాణాలను పెద్ద ఎత్తున పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. కొద్దిరోజులు కిందట సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ముందే ఈ పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. పండగకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా రోడ్లు బాగాలేదని ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడితే దానికి సంబంధిత ఎమ్మెల్యేలే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందుగానే ఎమ్మెల్యేలు ఈ పనులు జోరుగా పూర్తయ్యాలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్