కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ అవార్డులో దక్కాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు కూడా ఈ పద్మ అవార్డుల్లో ప్రాధాన్యత దక్కింది. వీరుడు హైదరాబాదుకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత జర్నకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్రెడ్డి ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డును దక్కించుకున్నారు.
అవార్డులు దక్కించుకున్న ప్రముఖులు
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ అవార్డులో దక్కాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు కూడా ఈ పద్మ అవార్డుల్లో ప్రాధాన్యత దక్కింది. వీరుడు హైదరాబాదుకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత జర్నకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్రెడ్డి ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డును దక్కించుకున్నారు. తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖుడు, శాసనసభ్యులు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఏపీ నుంచి ప్రముఖ అవధాన విద్వాంసులు మాడుగుల నాగఫణి శర్మ, ప్రముఖ విద్యావేత్త, రచయిత కేఎల్ కృష్ణ, కళా రంగానికి చెందిన మిర్యాల అప్పారావు (మారణానంతరం), విద్యారంగానికి చెందిన వాదిరాజు రాఘవేంద్ర ఆచార్య పంచముఖి, తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగలకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ బెహర్, ఇటీవల మరణించిన ప్రముఖ మలయాళీ రచయిత వాసుదేవన్ నాయర్, ప్రముఖ వయోలిన్ విధ్వంసుడు ఎల్ సుబ్రహ్మణ్యం, కథక్ నృత్యకారిణి కుముదిని లిఖియా, ప్రముఖ జానపద గాయని శారద సిన్హ, జపాన్ కు చెందిన వ్యాపారవేత్త, సుజుకి మోటార్ చైర్మన్ సుజుకి(మరణానంతరం)కి పద్మ విభూషణం పురస్కారాలు లభించాయి. పద్మభూషణ్ అవార్డులు లభించిన వారిలో మహారాష్ట్ర మాజీ సీఎం, మాజీ లోక్సభ స్పీకర్, శివసేన నేత మనోహర్ జోషి, సీనియర్ జర్నలిస్ట్ కే సూర్య ప్రకాష్, ప్రముఖ సినీ నటులు అనంతనాగ్, అజిత్ కుమార్, దర్శకుడు శేఖర్ కపూర్, నటి, భరతనాట్య ప్రముఖురాలు శోభన, ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ, ప్రముఖ హాకీ కోచ్ పిఆర్ శ్రీజేష్, ఇటీవల మరణించిన ప్రముఖ ఆర్థిక వేత్త వివేక్ దెబ్రాయ్, ఆధ్యాత్మికవేత్త సాద్వి రతంబర, నల్లి స్కిల్స్ అధినేత నల్లి కుప్పుస్వామి శెట్టి తదితరులు ఉన్నారు. పద్మశ్రీ పురస్కారాలు పొందిన ప్రముఖులలో గాయకుడు అర్జిత్ సింగ్, సుప్రీంకోర్టు న్యాయవాది సిఎస్ వైద్య నాథన్, ప్రముఖ రాజస్థానీ రచయిత షిన్ కాప్ నిజాం తదితరులు ఉన్నారు. తమిళనాడుకు చెందిన దినమలర్ పత్రిక యజమాని లక్ష్మీపతి రామసుబ్బయ్యర్ కు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. తమిళనాడు నుంచి ఇటీవల రిటైర్డ్ అయిన ప్రముఖ క్రికెట్ స్పిన్నర్ రవిచంద్రన్ పద్మశ్రీ వరించింది. అత్యంత విజయవంతమైన స్టార్టప్లు ఫ్లిప్కార్ట్, ఓలా, స్విగ్గి, బుక్ మై షోలను తొలి దశలోనే గుర్తించి వాటి పురోగతికి అండగా నిలిచిన వెంచర్ క్యాపిటలిస్ట్ ప్రశాంత్ ప్రకాశ్ (కర్ణాటక) ను పద్మశ్రీ తో గౌరవించారు. జాతీయ గీతానికి కొత్త ట్యూన్ కట్టిన సంగీతకారుడు రికీ గ్యాన్ కేజ్ (కర్ణాటక)కు పద్మశ్రీ అవార్డు దక్కింది.