అమెరికా అధ్యక్షుడు ధర్పానికి అద్దం పట్టే కారు.. ఎటువంటి దాడులనైనా తట్టుకునే సామర్థ్యం దీని సొంతం

అమెరికా అధ్యక్షుడిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ట్రంప్ భద్రతా వ్యవస్థ కూడా అత్యాధునిక సాంకేతికతతో కూడుకుని ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రయాణించే కారు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారుగా పరిగణిస్తారు. యుఎస్ ప్రెసిడెంట్ లిమోసిన్ కారులో ప్రయాణిస్తారు. దీనిని 'ది బీస్ట్' అని కూడా పిలుస్తారు. ఈ కారు ఎటువంటి దాడులను ఆయన తట్టుకుంటుంది. ముఖ్యంగా రసాయన దాడి కూడా ఈ కారును ఏమాత్రం ప్రభావితం చేయలేదు.

The car that the US President travels in

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారు

ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా. అటువంటి అగ్ర రాజ్యానికి అధ్యక్షుడు అంటే ఆషామాషి విషయం కాదు. ఈయన భద్రత గురించి చెప్పాల్సిన పని ఉండదు. ప్రపంచంలో ఎక్కడా లేని టెక్నాలజీ ఈయన భద్రతకు వినియోగిస్తారు. నిరంతరం పటిష్టమైన బందోబస్తు ఈయనకు రక్షణగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఈయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. ఏ క్షణంలో ఎటువంటి దాడులు అయినా జరగవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి దాడులు జరిగిన అమెరికా అధ్యక్షుడు భద్రతకు ఢోకా లేకుండా అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఆయనకు అండగా ఉంటుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ కు అటువంటి పటిష్టమైన రక్షణను అమెరికా రక్షణ శాఖ కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వినియోగించే ఒక కారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ కారు పేరే ది బీస్ట్. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం) ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రపంచంలో అత్యంత శక్తిమంతుడైన నేతగా ట్రంప్ నిలిచారు. ఎందుకంటే 

అమెరికా అధ్యక్షుడిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ట్రంప్ భద్రతా వ్యవస్థ కూడా అత్యాధునిక సాంకేతికతతో కూడుకుని ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రయాణించే కారు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారుగా పరిగణిస్తారు.  యుఎస్ ప్రెసిడెంట్ లిమోసిన్ కారులో ప్రయాణిస్తారు. దీనిని 'ది బీస్ట్' అని కూడా పిలుస్తారు. ఈ కారు ఎటువంటి దాడులను ఆయన తట్టుకుంటుంది. ముఖ్యంగా రసాయన దాడి కూడా ఈ కారును ఏమాత్రం ప్రభావితం చేయలేదు. మందు గుండు సామగ్రి, ఇతర పేలుళ్లు ఈ కారును కనీసం కదల్చలేవు. అమెరికా అధ్యక్షుడి కారు బరువు 9000 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఈ కారు ధర దాదాపు ఒకటిన్నర మిలియన్ డాలర్లు. ఈ కారు పేలుళ్లు లేదా రసాయన దాడులు కూడా ఏమీ చేయలేవు. 

అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన నేతలు గడిచిన కొన్నాళ్లుగా ఇదే కారు వినియోగిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కూడా కొత్త మోడల్ లిమోసిన్‌ను ఉపయోగిస్తున్నారు. దీన్ని 2014 నుంచి ప్రెసిడెంట్‌ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. డొనాల్డ్‌ ట్రంప్‌ 2018 లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నుంచి దిగిపోయేంత వరకు వినియోగించారు. ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడన్ ఇదే కారణం వినియోగించారు. మళ్లీ డోనాల్డ్ ట్రంప్ ఇదే కారు వినియోగించబోతున్నారు.  

ది బెస్ట్ లో ఉండే సదుపాయాలు ఎన్నో..

అమెరికా అధ్యక్షుడు పదవి అంటే ధర్పంతో కూడుకున్న పదవి. ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా. అటువంటి దేశానికి అధిపతి అంటే అసాధారణ స్థాయిలో భద్రత, సదుపాయాలు ఉంటాయి. అధ్యక్షుడు వినియోగించే ది బీస్ట్ కారులో కూడా అటువంటి సదుపాయాలు ఉంటాయి.  

'ది బీస్ట్'లో నైట్ విజన్ సిస్టమ్ ఉంది. 

ఇది కాకుండా, ఈ కారులో టియర్ గ్యాస్ ఫైరింగ్ కెపాసిటీని కూడా అమర్చారు. ఈ కారు డోర్ హ్యాండిల్‌కు విద్యుత్ ప్రవాహాన్ని తీసుకురావచ్చు. ఎవరైనా కారు హ్యాండిల్ పట్టుకుని తెరిచే ప్రయత్నం చేస్తే షాక్ కొడుతుంది. ఈ కారు కిటికీలు మూడు అంగుళాల మందం,  కవచం ఎనిమిది అంగుళాల మందంతో ఉంటాయి. అమెరికా అధ్యక్షుడికి ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే ఎక్కించేందుకు అనుగుణంగా బ్లడ్ గ్రూపుతో కూడిన రక్తం అందుబాటులో ఉంటుంది. ఈ కారులో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఒక లిమోసిన్ కారులో ఒకేసారి ఏడుగురు కూర్చుని ప్రయాణం చేయవచ్చు. ఈ కారు అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడింది. 'ది బీస్ట్' కారు టైర్లు అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. టైర్ కాల్చినా, పేల్చినా.. ఈ కారు టైర్ లేకుండానే అనేక కిలో మీటర్లు ప్రయాణించగలదు. బీస్ట్ కారు సున్నా నుండి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకునేందుకు కేవలం 15 సెకన్లు మాత్రమే సమయం పడుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్