బుడమేరు గండ్లు పూడ్చేందుకు రంగంలోకి దిగిన ఆర్మీ.. నేటి నుంచి పనులు

విజయవాడ వరదలకు కారణంగా భావిస్తున్న బుడమేరు గండ్లు పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారాన్ని కోరింది. గండ్లు పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్మీ బృందాన్ని రంగంలోకి దించుతోంది. బుడమేరు వాగుకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చడానికి ఆర్మీ బృందం వస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బుడమేరు గండ్లు పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ నైపుణ్యం జోడించేందుకు ఆర్మీ నిపుణులు గురువారం రాత్రి విజయవాడకు చేరుకున్నట్లు సీఎం వెల్లడించారు.

central team

బుడమేరు గండ్లు పూడ్చేందుకు వచ్చిన కేంద్ర బృందం

విజయవాడ వరదలకు కారణంగా భావిస్తున్న బుడమేరు గండ్లు పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారాన్ని కోరింది. గండ్లు పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్మీ బృందాన్ని రంగంలోకి దించుతోంది. బుడమేరు వాగుకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చడానికి ఆర్మీ బృందం వస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బుడమేరు గండ్లు పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ నైపుణ్యం జోడించేందుకు ఆర్మీ నిపుణులు గురువారం రాత్రి విజయవాడకు చేరుకున్నట్లు సీఎం వెల్లడించారు. శుక్రవారం గండ్లు పూడ్చే పనులను ప్రారంభించనున్నారు. బుడమేరు వరదలు మళ్లించడానికి తాము గతంలో చేపట్టిన పనులను జగన్ ప్రభుత్వం 2020 లో నిలిపేసిందని, ఆ వాగుకు పడిన గండ్లను పూడ్చకుండా వదిలేసిందని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా ఆరోపించారు. ఆ గండ్ల నుంచి వరద విజయవాడ నగరంపై పడిందన్నారు. మామూలుగా బుడమేరుకు ఏడు నుంచి ఎనిమిది వేల క్యూసెక్కుల వరద వచ్చేదని, కానీ రెండు రోజుల్లో అతి భారీగా 40 సెంటీ మీటర్లు వర్షం కురవడంతో ఏకంగా 30 వేల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. ఈ స్థాయిలో వర్షం కురవడం మామూలు విషయం కాదని, ఇటువంటి పరిణామాల్ని ఎలా ఎదుర్కోవాలో సాంకేతిక నిపుణులతో మాట్లాడుతున్నట్లు చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రకాశం బ్యారేజీని వందేళ్ల కిందట 11.30 లక్షల క్యూసెక్కుల వరద తట్టుకునేలా నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు దాదాపు అంతే వరద వచ్చింది. రానున్న రోజుల్లో ఈ వరద పెరిగితే ఎలా అన్న దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 15 లక్షల క్యూసెక్కుల వరదను కూడా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని ఎలా పటిష్ట పరచాలన్న దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కృష్ణా నది కట్టలను కూడా బలోపేతం చేయాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇవన్నీ కేంద్ర దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్రం నుంచి తగిన సాయం అందేలా చూడగలరని భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 

చంద్రబాబును ప్రశంసించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 

వరదల సమయంలో సీఎం చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన సహాయకు చర్యలు పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబు నాయుడు మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. 'ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, మరోవైపు ప్రకృతి వైపరీత్యం వీటి నడుమ మీ పాలనా దక్షత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం. అభినందనీయం. ఇలాంటి సమయంలో ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతోపాటు వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నాను. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్, ఇతర శాఖలు యుద్ద ప్రాతిపదికన పాల్గొంటున్నాయి. త్వరలోనే మనం ఈ సంక్షోభం నుంచి బయటపడతామని ఆశిస్తున్నాను' అంటూ పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఒకవైపు వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న ఆయన అధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్