సూపర్ సిక్స్ లో ప్రధానమైన హామీలుగా భావించే అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ (రైతులకు ఆర్థిక సాయం) పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమ్మకు వందనం పథకాన్ని జనవరి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తల్లులందరికీ లబ్ధి చేకూరనుంది. తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్న వారందరికీ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు దిశగా అడుగులు వేస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నాయకులు సూపర్ సిక్స్ పేరుతో పలు హామీలు అమలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్న ఈ పథకాలను అమలు చేయడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీలక హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ లో ప్రధానమైన హామీలుగా భావించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ (రైతులకు ఆర్థిక సాయం) పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమ్మకు వందనం పథకాన్ని జనవరి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తల్లులందరికీ లబ్ధి చేకూరనుంది. తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్న వారందరికీ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. చదువుతున్న ఒక్కో విద్యార్థికి రూ.15000 చొప్పున ప్రభుత్వం అందించనుంది. ఈ మొత్తాన్ని నేరుగా తల్లి ఖాతాలోకి జమ చేయనున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా 15000 చొప్పున ఆర్థిక సాయం అందించేది. అయితే ఇందులో రెండు వేల రూపాయలను స్కూల్ నిర్వహణ కోసం కట్ చేసి రూ.13000 మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ చేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం తాము అధికారంలోకి వస్తే పూర్తిగా రూ.15 వేల రూపాయలను తల్లులు ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకాన్ని వర్తించేలా నిబంధనలు పెట్టగా, కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. జనవరి నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జూనియర్ కాలేజీలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో 83,15,341 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వీరు తల్లుల సంఖ్య 42.61 లక్షల మంది. గత ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని తల్లులకు మాత్రమే అమలు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికి మాత్రమే ఈ పథకంలో భాగంగా లబ్ధిని చేకూర్చడంతో ఏటా రూ.6,394 కోట్లు ఇందుకోసం వెచ్చించాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వం తల్లులకు కాకుండా విద్యార్థులందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది కూడా రూ.80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ తల్లికి వందనం అమలు చేసేందుకు దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే విధంగా రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు అనుగుణంగా అన్నదాత సుఖీభవ పేరుతో పథకాన్ని వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు కసరత్తు జరుగుతుంది రైతు భరోసాలో ఉన్న లోపాలను పరిహరించి వాస్తవ సాగుదారులను పరిగణలోకి తీసుకొని అటు భూ యజమానులకు ఇటు కౌలు రైతులకు ఆసరా ఇచ్చేలా సన్న చిన్న కారు రైతులకు ఆర్థిక సహాయం అందేలా పథకాన్ని రూపకల్పన చేయనున్నారు కేంద్రం పిఎం కిసాన్ కింద ఇచ్చే 6000 తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 14000 కలిపి మొత్తంగా 20 వేల రూపాయలు ఒక్కో రైతుకి ఏడాదికి అందించనున్నారు మార్చి ఏప్రిల్ నెలలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి గతంలో రైతు భరోసా సాయం కొంతమందికి మాత్రమే అందించేవారు అటువంటి ఇబ్బందులు లేకుండా అర్హులైన అందరికీ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.