జగిత్యాల నుంచి అరుణాచలం వెళ్లాలనుకొనే యాత్రికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జగిత్యాల నుంచి నేరుగా అరుణాచలంకు ప్రత్యేక బస్సును నడపనున్నట్లు తెలిపింది.
ప్రతీకాత్మక చిత్రం
జగిత్యాల, ఈవార్తలు : జగిత్యాల నుంచి అరుణాచలం వెళ్లాలనుకొనే యాత్రికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జగిత్యాల నుంచి నేరుగా అరుణాచలంకు ప్రత్యేక బస్సును నడపనున్నట్లు తెలిపింది. ఈ నెల 19న (శుక్రవారం) రోజు జగిత్యాల నుంచి సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభం అవుతుందని.. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా ఈ నెల 20న రాత్రికి అరుణాచలం చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. తిరిగి ఈ నెల 21న బస్సు ప్రారంభమై.. 22వ తేదీన అలంపూర్ జోగులాంబ దేవాలయం చేరుకొని, అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి జగిత్యాలకు చేరుకుంటుందని వివరించారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.4,600 చార్జి ఉంటుందని తెలిపారు. ఆసక్తి గలవారు ఆర్టీసీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
జగిత్యాల టు అరుణాచలం సూపర్ లగ్జరీ బస్సు
ప్రయాణ తేదీ : 19 జూలై 2024
తిరుగు ప్రయాణం : 22 జూలై 2024
మొత్తం : 4 రోజుల ట్రిప్
చార్జి : రూ.4,600
సందర్శించే ప్రదేశాలు : కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, అలంపూర్ జోగులాంబ