ప్రపంచ కుబేరుడు టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ భారతదేశంలోకి ప్రవేశిస్తున్నాడు. ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా ఎలక్ట్రికల్ కంపెనీ తన కార్లను భారత్లో విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కంపెనీ భారత్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు దీనికోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. టెస్లా రాక కోసం భారత్ కూడా ఎదురుచూస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ నిరీక్షణకు తెరపడనుంది. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన మొదటి షో రూమ్ కోసం స్థలాన్ని చూసింది. షోరూం ఏర్పాటు కోసం కంపెనీ దాదాపు 4వేల చదరపు అడుగుల స్థలాన్ని ఆర్థిక చూసుకుంది.
టెస్లా కారుతో ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ భారతదేశంలోకి ప్రవేశిస్తున్నాడు. ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా ఎలక్ట్రికల్ కంపెనీ తన కార్లను భారత్లో విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కంపెనీ భారత్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు దీనికోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. టెస్లా రాక కోసం భారత్ కూడా ఎదురుచూస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ నిరీక్షణకు తెరపడనుంది. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన మొదటి షో రూమ్ కోసం స్థలాన్ని చూసింది. షోరూం ఏర్పాటు కోసం కంపెనీ దాదాపు 4వేల చదరపు అడుగుల స్థలాన్ని ఆర్థిక చూసుకుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో టెస్లా తన మొదటి షో రూమ్ను ప్రారంభించేందుకు ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. టెస్లా కంపెనీ కొర్లాలోని వాణిజ్య కాంప్లెక్స్ లోని గ్రౌండ్ ఫ్లోర్లో 4వేల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది. దీని నెలవారి అధ్యయ చదరపు అడుగుకు రూ.900గా చెబుతున్నారు. అంటే నెలకు దాదాపు 35 లక్షల రూపాయలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. టెస్లా ఈ స్థలాన్ని ఐదేళ్లకు గాను అద్దెకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ కంపెనీ తన విస్తృతశ్రేణి కార్లను ప్రదర్శిస్తుంది. అన్ని సరిగ్గా జరిగితే కంపెనీ ఏప్రిల్ నుంచి కార్ల అమ్మకాలను ప్రారంభించవచ్చు. ముంబై తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా టెస్లా సంస్థ షోరూంను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం ఆ కంపెనీ ఢిల్లీలోనే ఏ రోజుకి షోరూమ్ కోసం స్థలం వెతుకుతోంది.
మరోవైపు టెస్లా సంస్థ భారత్లో తన కార్ల తయారీ యూనిట్ను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. దీనికోసం దేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. టెస్లా సంస్థను తమ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా తమ ప్రతిష్టను మరింత పెంచుకోవాలని ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు భావిస్తున్నారు. టెస్లా సంస్థ యూనిట్ కోసం ప్రయత్నిస్తున్నా రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఉన్నట్లు చెబుతున్నారు. టెస్లా సంస్థ తమ కార్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా సహకారాన్ని అందించేందుకు ఆయా ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక రాయితీలను కూడా అందిస్తామని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే తమకు ఉన్న వనరులు, నెట్వర్క్ ద్వారా టెస్లా కంపెనీతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎలాన్ మస్క్ కార్ల తయారీ కంపెనీ యూనిట్ను ఇండియాలో ఎక్కడ ఏర్పాటు చేస్తారో చూడాల్సి ఉంది.