పదో తరగతి పరీక్షలు ఇకపై ఏటా రెండుసార్లు.. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి

పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకునే దిశగా సీబీఎస్ఈ ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఏడాదికి ఒకసారి మాత్రమే పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తున్నారు. అయితే ఇకపై ఏటా రెండుసార్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనను సీబీఎస్ఈ చేస్తోంది. ఈ విధానాన్ని 2026 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఎందుకు సంబంధించిన విధివిధానాలను ప్రజలకు అందుబాటులో వించింది. ఈ నిర్ణయం పట్ల మార్చి 9వ తేదీలోగా అభిప్రాయాలు చెప్పాలని ప్రజలను కోరింది. ఫిబ్రవరి 17 నుంచి మార్చి ఆరో తేదీ వరకు తొలి విడతగా, మే 5వ తేదీ నుంచి 20 వరకు రెండో విడతగా పరీక్షలు నిర్వహించాలని ముసాయిదాలో పేర్కొంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకునే దిశగా సీబీఎస్ఈ ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఏడాదికి ఒకసారి మాత్రమే పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తున్నారు. అయితే ఇకపై ఏటా రెండుసార్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనను సీబీఎస్ఈ చేస్తోంది. ఈ విధానాన్ని 2026 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఎందుకు సంబంధించిన విధివిధానాలను ప్రజలకు అందుబాటులో వించింది. ఈ నిర్ణయం పట్ల మార్చి 9వ తేదీలోగా అభిప్రాయాలు చెప్పాలని ప్రజలను కోరింది. ఫిబ్రవరి 17 నుంచి మార్చి ఆరో తేదీ వరకు తొలి విడతగా, మే 5వ తేదీ నుంచి 20 వరకు రెండో విడతగా పరీక్షలు నిర్వహించాలని ముసాయిదాలో పేర్కొంది. ఇంప్రూవ్మెంట్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రెండు విడతల్లోనూ పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించనుంది. ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని సబ్జెక్టులు మాత్రమే ఎంచుకునే సౌలభ్యాన్ని కూడా కల్పిస్తోంది. రెండు విడతల్లోనూ మొత్తం సిలబస్కు పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు విడతలకు కూడా ఒకే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. పరీక్షా కేంద్రానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయరు. 2026 ఫిబ్రవరిలో పరీక్షలు రాసే విద్యార్థులు జాబితాను 2025 సెప్టెంబర్ నాటికి తయారుచేసి వెల్లడిస్తారు. ఈ జాబితాలో పేరు ఉన్న వారికి మాత్రమే 2026 మే నెలలో జరిగే పరీక్షలకు అనుమతి కల్పిస్తారు. ఒక్కసారి జాబితా ఖరారు చేసిన తర్వాత సబ్జెక్టులను మార్చుకునే అవకాశం విద్యార్థులకు ఉండదు. తాజా నిర్ణయం వల్ల విద్యార్థులకు మేలుకొరుగుతుందని సీబీఎస్ఈ చెబుతోంది.

అయితే సీబీఎస్ఈ తీసుకుంటున్న ఈ నిర్ణయం పట్ల ఆయా పాఠశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకు సిబిఎస్ఈ సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు మేలు కలుగుతుందని, ఒత్తిడి తగ్గుతుందని సీబీఎస్ఈ చెబుతోంది. అయితే రెండుసార్లు పరీక్షలు రాయాల్సి రావడం వల్ల విద్యార్థుల్లో అలసత్వం పెరిగే అవకాశం ఉందన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఒత్తిడి కూడా పెరుగుతుందని పేర్కొంటున్నారు. అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సీబీఎస్ఈ భావించిన నేపథ్యంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ఈ నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే 2026 నుంచి సానుకూలంగా స్పందన వస్తే అమలులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. మరి దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ఎలా స్పందిస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ విధానం వల్ల విద్యార్థులకు మేలు కలుగుతుందా.? లేదా అన్నదానిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని మరికొందరు పేర్కొంటున్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు మేలుకొరుగుతుందన్న భావనను ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఇంప్రూవ్మెంట్ లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని సీబీఎస్ఈ తీసుకుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్