కుటుంబ అవసరాల కోసం నెలవారీ ఖర్చుల్లో తెలుగు రాష్ట్రాలే టాప్.. తాజా సర్వేలో వెల్లడి

కుటుంబ అవసరాల కోసం నెలకు ఖర్చు చేసే వ్యయం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోనే ప్రజల నెలవారి ఖర్చులను తెలుసుకునే ఉద్దేశంతో గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24' పేరుతో 2023 ఆగస్టు నుంచి 2024 జూలై మధ్య రాష్ట్రాలు వారిగా ఒక సర్వేను ఈ సంస్థ నిర్వహించింది. దేశంలోని పేదరికం, అసమానతలు, కుటుంబాల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు ఈ సర్వేను నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల వారీగా ఈ సర్వే నిర్వహించారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

కుటుంబ అవసరాల కోసం నెలకు ఖర్చు చేసే వ్యయం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోనే ప్రజల నెలవారి ఖర్చులను తెలుసుకునే ఉద్దేశంతో గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24' పేరుతో 2023 ఆగస్టు నుంచి 2024 జూలై మధ్య రాష్ట్రాలు వారిగా ఒక సర్వేను ఈ సంస్థ నిర్వహించింది. దేశంలోని పేదరికం, అసమానతలు, కుటుంబాల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు ఈ సర్వేను నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల వారీగా ఈ సర్వే నిర్వహించారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 1,54,357 మంది నుంచి, పట్టణ ప్రాంతాల్లో 1,07,596 మంది నుంచి వివరాలు సేకరించారు. దేశవ్యాప్తంగా కుటుంబాలు నెలవారీగా పెడుతున్న ఖర్చుల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలు నెలవారీ తలసరి వినియోగానికి చేస్తున్న ఖర్చులు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండడం విశేషం. పట్టణాల్లో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగంలో తెలుగు రాష్ట్రాలు మిగతా రాష్ట్రాల కంటే ముందున్నాయి. తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో కుటుంబాలు నెలకు రూ.9,131 ఖర్చు చేస్తుండగా, ఏపీ పట్టణ ప్రాంతాల్లో ఈ లెక్క రూ.9,877 గా ఉంది.

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు నెలకు రూ.5,675 ఖర్చు చేస్తుండగా, ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,107 ఖర్చు పెడుతున్నారు. జాతీయస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో నెలవారి ఖర్చు సగటు రూ.4,122 కాగా, పట్టణ ప్రాంతాల్లోనే ప్రజల జాతీయ ఖర్చు సగటు రూ.6,996 గా ఉంది. జాతీయ సగటు కంటే ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారి ఖర్చు ఉండడం విశేషం. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల జీవన విధానం కొంత మెరుగ్గా ఉన్నట్లు తాజా సర్వేలో వెళ్ళడైంది. కేరళ గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.6,611 రూపాయలు ఖర్చు చేస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.7,834 చొప్పున ఖర్చు చేస్తున్నారు. తమిళనాడులో అయితే గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు నెలకు రూ.5,872 ఖర్చు చేస్తుండగా, పట్టణాల్లోనే కుటుంబాలు రూ.8,325 చొప్పున వెచ్చిస్తున్నారు. కర్ణాటకలోని పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు నేలకు రూ.8,129 ఖర్చు చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు నెలకు రూ.5,008 చొప్పున విచ్చేస్తున్నారు. పారిశ్రామిక రాష్ట్రాలుగా పేరుగాంచిన గుజరాత్, మహారాష్ట్రలో జాతీయ సగటుకు కొంత అటు ఇటుగా కుటుంబాల నెలవారీ ఖర్చులు ఉన్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్