శ్రీరామనవమికి ప్రత్యేకతగా భద్రాచలం ట్రైబల్ మ్యూజియం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఖండాంతరాలకు వ్యాపించడానికి భద్రాచలం ట్రైబల్ మ్యూజియం ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

badrachalam tribal museum
భద్రాచలం ట్రైబల్ మ్యూజియం బ్రోచర్‌ను విడుదల చేస్తున్న సీఎం రేవంత్ తదితరులు

ఈవార్తలు, భద్రాచలం: గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఖండాంతరాలకు వ్యాపించడానికి భద్రాచలం ట్రైబల్ మ్యూజియం ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన తెగలకు సంబంధించిన ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన బ్రోచర్‌ను అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనుల జీవన విధానాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, వేష భాషలు, హస్త కళలు, పాతకాలపు వస్తువులు, వారి వ్యవసాయ పద్ధతులను మ్యూజియంలో ప్రదర్శించడం గొప్ప విషయమని అన్నారు. ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో భద్రాచలం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని, ఇది స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు. గిరిజన సంస్కృతి పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, గిరిజనుల వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి మ్యూజియం ఉపకరిస్తుందని వివరించారు.

 భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల అభివృద్ధికి ఈ మ్యూజియం ఏర్పాటు కీలక అడుగు అని సీఎం పేర్కొన్నారు. మ్యూజియం ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ చూపించిన ఐటీడీఏ పీవో  రాహుల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, మట్టా దయానంద్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బీ రాహుల్, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్