Rain Alert | రేపు తెలంగాణలో ఈదురు గాలులతో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ స్థాయిలో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

rain alert telangana

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ స్థాయిలో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దాంతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారుతున్నాయి. గత నెల చివర్లో కాస్త కుదుట పడ్డ వానలు.. మళ్లీ జోరందుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మేఘావృతమై ఉంది. అటు.. గురువారం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వానలు కురిశాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్