తెలంగాణలో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలే.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

telangana rains

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రను అనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోందని, సముద్ర మట్టాలనికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. గోవా నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు, పడమర ద్రోణి బలహీనపడిందని వివరించింది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడి 30-40 కిలోమీటర్ల వేగంలో గాలులు వీస్తూ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వివరించింది. వర్షాలు ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్