జగిత్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు

జగిత్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో పేదలకు ఇళ్లు మంజూరు కాకుండా, ఆర్థికంగా స్థిరపడిన వారి పేర్లు జాబితాల్లో చేరుతున్నట్లు సమాచారం.

jagtial news

జగిత్యాల జిల్లాలో సంఘటన

జగిత్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో పేదలకు ఇళ్లు మంజూరు కాకుండా, ఆర్థికంగా స్థిరపడిన వారి పేర్లు జాబితాల్లో చేరుతున్నట్లు సమాచారం. కొడిమ్యాల మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో లబ్ధిదారుల ఎంపిక తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులకు విలువ ఇవ్వలేదని, లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అటు.. మల్యాల మండలంలో పలుచోట్ల ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపిక చేయలేదని మహిళలు అధికారులను నిలదీశారు. కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని, ఉన్న వారికి ఇళ్లు మంజూరు చేయడం అన్యాయమని వారు ఆరోపించారు. అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తూ తమ ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే, సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో సమస్యలు పరిష్కరించడానికి, ఉన్నతాధికారులు గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి, పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత, న్యాయం పాటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్