వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును చేర్చారు.
పట్నం నరేందర్ రెడ్డి, కేటీఆర్
వికారాబాద్, ఈవార్తలు : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును చేర్చారు. బుధవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు. ఆ రిపోర్టులో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్‌తో పాటు ఇతరుల ఆదేశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ‘పట్నం నరేందర్ రెడ్డి రైతులను ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టారు. అనుచరుడు భోగమోని సురేశ్ ద్వారా ప్రభావితం. కొందరికి డబ్బు ఇచ్చి దాడికి ఉసిగొల్పారు. అధికారులను చంపినా ఫర్వాలేదని రైతులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు’ అని రిపోర్టులో పేర్కొన్నారు.
మరోవైపు.. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దాడి ఘటనపై తెలంగాణ ఐఏఎస్‌ల సంఘం స్పందించింది. దాడి ఘటనను ఖండించిన ఐఏఎస్‌ల సంఘం.. దాడులతో అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొంది. ఇలాంటి ఘటనలు సరికావని అభిప్రాయపడింది.