స్థిరాస్తి రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులకు నటుడు జగపతిబాబు సూచించారు. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు పెరుగుతున్నాయని, తాను కూడా బాధితుడినేనని జగపతిబాబు పేర్కొన్నారు.
నటుడు జగపతిబాబు
స్థిరాస్తి రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులకు నటుడు జగపతిబాబు సూచించారు. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు పెరుగుతున్నాయని, తాను కూడా బాధితుడినేనని జగపతిబాబు పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చెప్పారని వెల్లడించిన జగపతిబాబు.. ఇటీవల తాను స్థిరాస్థిరంగానికి సంబంధించిన ఓ యాడ్ లో నటించి మోసపోయినట్లు వెల్లడించారు. స్థిరాస్థిరంగానికి సంబంధించి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. నమ్మదగ్గ సంస్థల్లో మాత్రమే స్థిరాస్తులు కొనుగోలు చేయాలని, ఈ విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆయన సూచించారు. తనను ఎవరు మోసం చేశారు, ఏం జరిగిందన్న విషయాలను త్వరలోనే చెబుతానని ఆయన స్పష్టం చేశారు.
భూమి కొనుగోలు చేసే ముందు రెరా నిబంధనలు తెలుసుకోవాలని జగపతిబాబు అభిమానులకు సూచించారు. కొనుగోలుదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎంతోమంది మోసాలకు పాల్పడుతున్నారని, ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని జగపతిబాబు పేర్కొన్నారు. ఎంతో కష్టపడి సంపాదించిన వారి డబ్బులను కొట్టేసేందుకు కొంతమంది తెలివిగా వ్యవహరిస్తున్నారని, ఈ తరహా మోసాలతో ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. జగపతిబాబు స్వయంగా మోసపోయినట్లు బయటకు చెప్పడంతో.. ఆ సంస్థ ఏది అన్నదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొన్నది.