వేములవాడ ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్ కనెక్షన్ కట్

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కరెంట్ కనెక్షన్‌ను విద్యుత్తు అధికారులు తొలగిస్తున్నారు.

vemulawada

వేములవాడ

వేములవాడ, ఈవార్తలు : తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కరెంట్ కనెక్షన్‌ను విద్యుత్తు అధికారులు తొలగిస్తున్నారు. చాలా ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్తు బిల్లులు కట్టడం లేదని, దాంతో భారీగా సెస్ బకాయి మిగిలిపోయిందని, ఆ కారణంతోనే విద్యుత్తు కనెక్షన్లు తొలగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చామని, బిల్లులు చెల్లించనందుకే కరెంట్ కట్ చేశామని పట్టణ సెస్ ఏఈ సిద్ధార్థ స్పష్టం చేస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్తు బకాయిలు ఇలా..

వేములవాడ బల్దియా (మున్సిపల్) రూ.3. 24 కోట్లు

ఏరియా ఆసుపత్రి రూ.13.19 లక్షలు

పాత సివిల్ ఆసుపత్రి రూ.3 లక్షలు

ఎంపీడీవో కార్యాలయం రూ.52 వేలు

సబ్ రిజిస్టర్ కార్యాలయం రూ.2.53 లక్షలు 

రూరల్ తాసిల్దార్ కార్యాలయం రూ.3.55 లక్షలు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్