జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మండల సమాఖ్య దొంగ ఆన్‌లైన్ డేటా వ్యవహారంలో తవ్వినకొద్దీ కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఈ ఆన్‌లైన్ డేటా వ్యవహారంపై ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం కూడా గతంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మండల సమాఖ్య దొంగ ఆన్‌లైన్ డేటా వ్యవహారంలో తవ్వినకొద్దీ కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఈ ఆన్‌లైన్ డేటా వ్యవహారంపై ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం కూడా గతంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆన్‌లైన్ డేటా చేయడంపై తన దృష్టికి రావడంతో.. నిబంధనలకు వ్యతిరేకంగా ఆన్‌లైన్ డేటా చేయడం తప్పు అని ఏపీఎం చిన్న రాజయ్యను ఎమ్మెల్యే నిలదీసినట్లు సమాచారం. అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం సమంజసం కాదని హెచ్చరించినట్లు తెలిసింది. అయినా, తీరు మారని ఆ అధికారి.. తప్పును కప్పిపుచ్చుకునేందుకు మాజీ ప్రజాప్రతినిధికి సభ్యత్వం కల్పించాలని బల్వంతాపూర్ గ్రామ సంఘంపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఒత్తిడికి తలొగ్గని ఆ గ్రామ సంఘం.. మాజీ ప్రజాప్రతినిధికి సభ్యత్వం కల్పించేదే లేదని తీర్మానం కూడా చేసినట్లు తెలిసింది. ఇక, ఆ మాజీ ప్రజాప్రతినిధి గతంలో బృందావనం ఎస్‌హెచ్‌జీ అనే సంఘంలో అధ్యక్షురాలు అని గత రికార్డుల్లో ఉంది. ఆ సంఘం తరఫున మ్యాచింగ్ గ్రాంట్ కూడా తీసుకొన్నారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. ఉద్దేశపూర్వకంగా ఆ సంఘమే లేకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలకు ఊతం కల్పించేలా ప్రస్తుత రికార్డుల్లో ఆ సంఘమే లేకపోవడం గమనార్హం. దీంతో శ్రీరాజరాజేశ్వరి గ్రామైక్య సంఘమే నేరుగా చొరవ తీసుకొని ఆ సంఘంలోని మిగతా సభ్యులను వేరే సంఘాల్లో చేర్పించింది.