తెలంగాణ బీర్ల లవర్లకు కింగ్ ఫిషర్ సంస్థ షాక్ ఇచ్చింది. తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ బీర్ల లవర్లకు కింగ్ ఫిషర్ సంస్థ షాక్ ఇచ్చింది. తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. టీజీ బీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడంతో బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ స్పష్టం చేసింది. ఈ మేరకు సెబీకి లేఖ ద్వారా యునైటెడ్ బ్రూవరీస్ తెలియజేసింది. అదీకాక.. 2019 నుంచి ధరలను సవరించకపోవడంతో భారీ నష్టాలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో తాము తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్లు సరఫరా చేయలేమని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో సెబీకి యునైటెడ్ బ్రూవరీస్ లేఖ రాసింది.
