తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండదు: సీఎం రేవంత్ రెడ్డి

Telangana News : తెలంగాణ అధికారిక చిహ్నం (Telangana Emblem)లో కాకతీయ కళాతోరణం ఉండబోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సమ్మక్క సారక్క, నాగోబా జాతర స్ఫూర్తికి అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందని వెల్లడించారు.

telangana emblem

తెలంగాణ అధికారిక చిహ్నం

Telangana News : తెలంగాణ అధికారిక చిహ్నం (Telangana Emblem)లో కాకతీయ కళాతోరణం ఉండబోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సమ్మక్క సారక్క, నాగోబా జాతర స్ఫూర్తికి అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందని వెల్లడించారు. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నాన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జయ జయహే తెలంగాణ గీతంపైనా స్పందించారు. ‘రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ సంగీతాన్ని సమకూర్చే వ్యవహారాన్ని ఆ పాట రచయిత అందెశ్రీకే అప్పగించాం. ఆయనే సంగీత దర్శకుడు కీరవాణిని ఎంపిక చేశారు. కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు. ఎవరితో సంగీతం చేయించాలన్న నిర్ణయాన్ని ఆయనకే వదిలేశా. నాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు’ అని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్